బాలయ్యతో కామెడీ అంటే మరి!

బాలయ్య సినిమాలు ఎలా ఉంటాయో ఊహించుకుంటే ఎవరికైనా కళ్ల ముందు క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాలు, మాస్ డైలాగులు, నరుక్కోవడాలు, తొడ కొట్టడాలు.. ఇవన్నీ వన్ బై వన్ కళ్లముందు కదుల్తాయి. కానీ ఈ సీక్వెన్స్ లో ఎక్కడా బాలయ్య కామెడీ చేస్తున్న సీన్ మాత్రం స్ఫురణకు రాదు. అలాంటి హీరోతో కామెడీ స్పెషలిస్ట్ అనీల్ రావిపూడి సినిమా అంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో సరికొత్త చర్చకు తెరలేచింది.

మొదటి సినిమా “పటాస్” నుంచి తాజాగా వచ్చిన “సరిలేరు నీకెవ్వరు” వరకు అనీల్ రావిపూడి ఎక్కడా తన బ్రాండ్ కామెడీ మిస్ అవ్వలేదు. చివరికి మహేష్ లాంటి హీరోను పెట్టి మరీ కామెడీ పండించాడంటే ఈ దర్శకుడికి ఆ సెగ్మెంట్ అంటే ఎంతిష్టమో, ఆ సెగ్మెంట్ పై ఎంత పట్టుందో అర్థం చేసుకోవచ్చు.

అలాంటి అనీల్ రావిపూడి, బాలయ్యతో ఎలా కామెడీ పండిస్తాడనే చర్చ ఇప్పుడు జోరుగా నడుస్తోంది. దీనికి కారణం అనీల్-బాలయ్య కాంబోలో సినిమా రాబోతోందనే ప్రచారమే. సినిమా ఓకే అవుతుందా అవ్వదా అనే విషయం పక్కనపెడితే.. బాలయ్యతో మూవీ ఓకే అయితే అనీల్ మాస్ హీరో బాలయ్యతో ఎలా కామెడీ పండిస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

వెంకటేష్ కు కామెడీలో పీహెచ్ డీ ఉంది కాబట్టి అనీల్ పని ఈజీ అయింది. వరుణ్ తేజ్ కు తెలంగాణ యాస యాడ్ చేసి మాయచేశాడు. ఇక రవితేజ, సాయితేజ్, కల్యాణ్ రామ్, మహేష్ లాంటి హీరోలతో కూడా అనీల్ కు సమస్య రాలేదు. ఎటొచ్చి రౌద్రానికి కేరాఫ్ గా ఉండే బాలయ్యతోనే ఆయన (ఒకవేళ మూవీ ఓకే అయితే) ఎలా కామెడీ పండిస్తాడో చూడాలి.

TeluguCinema

Recent Posts

Bhagyashri Borse: తొలి సినిమా నుంచి ఆ కథలే భాగ్యం

కెరీర్ లో ఎవరైనా ఒక పీరియడ్ సినిమా చేస్తారు, లేదంటే 2 చేస్తారు. కానీ కెరీర్ ప్రారంభించినప్పట్నుంచి వరుసగా అవే…

45 seconds ago

Nabha Natesh: ఒకటి ఇప్పుడు, ఇంకోటి ఎప్పుడు?

హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh) తెగ హడావిడి చేస్తోంది. సినిమాకి ఎంత ప్రచారం చెయ్యాలన్నా చేస్తాను అన్నట్లు "నాగబంధం"…

24 hours ago

Dasara 2026: సూపర్ స్టార్ వర్సెస్ మెగాస్టార్?

ఈ దసరా పండక్కి (Dasara 2026) రెండు పెద్ద సినిమాలు పోటీ పడేలా ఉన్నాయి. ఒక పెద్ద సినిమాకి అధికారికంగా…

1 day ago

మాల్దీవుల్లో Malavika Mohanan అందాల ఆరబోత

మాళవిక మోహనన్ అంటేనే గ్లామర్ షో అని చెప్పాలి. ఆమె అందాల ఆరబోతలో అస్సలు సిగ్గుపడదు. ఇక ఇప్పుడు మాల్దీవుల్లో…

1 day ago

ఇదే నా మొదటి సినిమా: Preity Mukhundhan

ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan) ... తెలుగులో ఆమె మొదటి సినిమా 'కన్నప్ప'. అలాగే ఆమె నటించిన 'బ్లాస్ట్' (Blast)…

1 day ago

Konidela Surekha ఒక్కసారైనా యాదగిరిగుట్టకి వెళ్ళారా?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట (Yadagiri Gutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన…

2 days ago