అతి తక్కువగా సినిమాలు చేసే అనుష్క మరో సినిమా రెడీ చేసింది. అంతా అనుకుంటున్నట్టు ఇది క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న ‘ఘాటీ’ సినిమా కాదు. మలయాళంలో ఆమె చేస్తున్న సినిమా రెడీ అవుతోంది.
ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయినట్టు మేకర్స్ ప్రకటించారు. అనుష్క నటిస్తున్న ఈ మలయాళ సినిమా 2 భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే.
దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మలయాళంలో ‘కథనార్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కొలిక్కి వచ్చిన వెంటనే తెలుగు పోస్టర్ ను విడుదల చేస్తారు. ఏ భాష సినిమానైనా తెలుగులో అదే టైటిల్ తో విడుదల చేయడం ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి, ఈ సినిమా కూడా ‘కథనార్’ అనే టైటిల్ తోనే వస్తే పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు.
హారర్ ఫాంటసీ థ్రిల్లర్ గా వస్తోంది ‘కథనార్’. అనుష్కకు ఇదే తొలి మలయాళం సినిమా.
9వ శతాబ్దపు క్రైస్తవ మతగురువు కడమత్తతు కథనార్ జీవితానికి కాస్త ఫిక్షన్ జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తర్వాత అనుష్క నుంచి వస్తున్న సినిమా ఇదే.
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…