మలయాళ నటుడు షైన్ టామ్ చాకోపై ఇప్పటికే నటి విన్సీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అతడు సెట్స్ పై డ్రగ్స్ తీసుకున్నాడంటూ చాలా పెద్ద ఆరోపణ చేసింది.
ఆరోపణలకు సంబంధించి చాకో ఇప్పటికే విన్సీకి భేషరతుగా క్షమాపణలు చెప్పాడు. అలా ‘అమ్మ’ ఆగ్రహానికి గురికాకుండా జాగ్రత్త పడ్డాడు. మరోవైపు విన్సీ కూడా ఈ వివాదాన్ని కేవలం అంతర్గతంగానే పరిష్కరించుకుంటాం తప్ప కోర్టు మెట్లు ఎక్కనని స్పష్టం చేసింది.
ఇలా అంతా సెటిల్ అవుతుందనుకున్న టైమ్ లో మరో నటి తెరపైకొచ్చింది. అవును.. చాకో డ్రగ్స్ తీసుకుంటాడు అంటూ ఆరోపణ చేసింది. ఆమె పేరు అపర్ణ జోన్స్. చాకోతో కలిసి గతంలో నటించిన ఈ హీరోయిన్, అతడిపై డ్రగ్స్ ఆరోపణలు చేసింది.
విన్సీ చెప్పినవన్నీ వంద శాతం నిజాలని, సెట్స్ లో ఏదో తెల్లటి పౌడర్ అతడు తింటుంటాడని తెలిపింది అపర్ణ. ప్రారంభంలో అదేంటో అర్థంకాక తను గ్లూకోజ్ అనుకునేదాన్నని, ఆ తర్వాత అతడి ప్రవర్తన చూసిన తర్వాత తనకు చాలా అనుమానాలు పెరిగాయని తెలిపింది.
చాకో సెట్స్ లో ఎప్పుడూ కలియదిరుగుతాడని, అసభ్యంగా మాట్లాడతాడని, దగ్గర్లో హీరోయిన్లు ఉంటే అతడి ప్రవర్తన మరింత అసభ్యంగా ఉండేదని చెప్పుకొచ్చింది. ఈ ఆరోపణలపై చాకో ఎలా స్పందిస్తాడో చూడాలి.
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…