పరిశ్రమలోకి వెళ్లాలని అనుకున్నప్పుడు తనకు ఎదురైన అనుభవాన్ని బయటపెట్టారు చిరంజీవి. తనను ఒక్కరు కూడా ప్రోత్సహించలేదని గుర్తుచేశారు. “నువ్వేమైనా పెద్ద అందగాడినని అనుకుంటున్నావా” అంటూ చాలామంది తనను ఎద్దేవా చేశారని అన్నారు చిరంజీవి.
పదో తరగతిలో వేసిన ఓ నాటకంతో నటనపై ఆసక్తి పెరిగిందని, ఆ తర్వాత మరో నాటకం వేసిన తర్వాత సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు చిరంజీవి తెలిపారు. అదే విషయాన్ని తన సమీప బంధువులు, స్నేహితులతో పంచుకుంటే అంతా తనను నిరుత్సాహపరిచారని అన్నారు.
కేవలం తన తల్లిదండ్రులు మాత్రమే తనను ప్రోత్సహించారని, అది కూడా మరో ఆప్షన్ పెట్టుకొని సినిమాల్లోకి వెళ్లమని సూచించారట. అలా చెన్నై చేరుకున్న చిరంజీవి, యాక్టింగ్ కోర్స్ తో పాటు ఐసీడబ్ల్యూఏ కూడా చదివారంట.
అయితే ఇలా చేయడం చిరంజీవికి నచ్చలేదంట. ఎలాగైనా ఇండస్ట్రీలో రాణించాలని మానసికంగా వంద శాతం ఫిక్స్ అయిన తను, చదువును పక్కనపెట్టి పూర్తిస్థాయిలో సినిమాలపై దృష్టి పెట్టానని అన్నారు. అలా మానసికంగా వంద శాతం సిద్ధమై ఏ పని చేసినా విజయం వరిస్తుందని అన్నారు చిరంజీవి.
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…