‘ఓదెల-2’ విడుదలైన వెంటనే అందులోని ఓ అభ్యంతరకరమైన సన్నివేశంపై కొంతమంది అనుమానం వ్యక్తం చేశారు. అదే నిజమైంది. ఈ సినిమాలో ‘పిచ్చగుంట్ల’ అనే పదాన్ని తప్పుగా వాడారు. దీంతో ఆ కులస్తులు మండిపడ్డారు.
ముందుగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కంప్లయింట్ తీసుకున్నారు కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆరోపించారు. తర్వాత వీళ్లు బీసీ కమిషన్ ను ఆశ్రయించారు. బీసీ కమిషన్ చొరవతో ఈ కేసులో కదలిక వచ్చింది.
సినిమాపై విచారణ జరిపించాలంటూ తెలంగాణ డీజీపీని ఆదేశించింది బీసీ కమిషన్. అలానే సెన్సార్ బోర్డును కూడా ప్రశ్నించింది. దీనిపై వెంటనే స్పందించిన సెన్సార్ బోర్డు… ఆ అభ్యంతరకర పదాన్ని తొలిగిస్తామని ప్రకటించింది.
తమన్నా లీడ్ రోల్ లో నటించిన ‘ఓదెల-2’ భారీ అంచనాల మధ్య రిలీజైంది. ట్రయిలర్ తో సినిమాకు ఊపొచ్చింది. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ మూవీ ఆ స్థాయిలో నిలబడలేకపోయింది. సినిమా సరిగ్గా ఆడలేదనే బాధకు తోడు నిర్మాతలకు ఇప్పుడిదో తలనొప్పి.
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…