ఫ్లాప్ అయిన సినిమాలు వీలైనంత తొందరగా ఓటీటీలోకి రావడం సర్వసాధారణం. “భారతీయుడు-2” సినిమాది కూడా ఇదే పరిస్థితి. ఫ్లాప్ అయిన ఈ సినిమా నెల తిరక్కముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. 9వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతుంది.
సినిమా ఫ్లాప్ అవ్వడంతో లైకా నిర్మాతలకు, నెట్ ఫ్లిక్స్ కు మధ్య డబ్బుల విషయంలో చిన్నపాటి గొడవ జరిగినట్టు వార్తలొచ్చాయి. సినిమా ఫెయిలైంది కాబట్టి చెప్పిన ఎమౌంట్ ఇవ్వలేమంటూ నెట్ ఫ్లిక్స్ మరోసారి బేరాలకు దిగినట్టు కథనాలు వచ్చాయి.
ఓవైపు ఇలా కథనాలు వస్తుండగానే, మరోవైపు భారతీయుడు-2 స్ట్రీమింగ్ డేట్ ను బయటపెట్టింది నెట్ ఫ్లిక్స్. అయితే ఈ సినిమా హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ డేట్ ను మాత్రం ఇంకా వెల్లడించలేదు.
కమల్ హాసన్ సేనాపతి పాత్రలో నటించిన ఈ సినిమాకు శంకర్ దర్శకుడు. 1996లో వచ్చిన “భారతీయుడు” సినిమాకు సీక్వెల్ గా భారతీయుడు-2 తెరకెక్కింది.
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…
తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…