ఎం.ఎం. కీరవాణి గొప్ప సంగీత దర్శకుడు. ఏకంగా ఆస్కార్ కూడా అందుకున్నారు. ఆస్కార్ అందుకొన్న మొదటి తెలుగు వాడు ఆయన. ఐతే, కీరవాణి గత కొంతకాలంగా హిట్ సాంగ్స్ ఇవ్వలేకపోతున్నారు. ఈ తరానికి నచ్చే నాటు పాటలు కంపోజ్ చెయ్యడం లేదు అనేది ఫిర్యాదు. ఇటీవల విడుదలైన “హరి హర వీర మల్లు”లో ఒక్క పాట కూడా వైరల్ కాలేదు.
అందుకే మెగాస్టార్ చిరంజీవి భయపడినట్లు ఉన్నారు. “విశ్వంభర” సినిమాలో ఒక ఐటెం సాంగ్ కోసం వేరే సంగీత దర్శకుడిని తీసుకుంటున్నారట. కీరవాణి ఈ సినిమాకి పాటలు, నేపథ్య సంగీతం ఇస్తున్నారు. కానీ ప్రత్యేక గీతం కోసం ప్రత్యేకంగా వేరే సంగీత దర్శకుడికి బాధ్యతలు అప్పగించబోతున్నారట.
ఇటీవల మ్యాడ్, సంక్రాంతికి వస్తున్నాం వంటి సూపర్ హిట్ మ్యూజికల్ ఆల్బమ్స్ ఇచ్చిన భీమ్స్ ఈ ‘విశ్వంభర’ సినిమా కోసం ఐటెం సాంగ్ కంపోజ్ చెయ్యబోతున్నారు.
ALSO READ: చిరుతో జాయిన్ అయిన నయనతార
అన్నట్లు ప్రస్తుతం చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న కొత్త సినిమాకి కూడా భీమ్స్ సంగీత దర్శకుడు.
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…
తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…