శృతి హాసన్ ఏ విషయం దాచుకోదు. ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తుంది. తన ముక్కుకి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న విషయాన్నీ ఆమె ఇప్పటికే చాలా సార్లు మీడియా ఇంటర్వ్యూలలో చెప్పింది. అలాగే ఒకప్పుడు బాగా తాగేదాన్నిఅని కూడా ఒప్పుకొంది.
సెలెబ్రిటీలు సహజంగా ఇలాంటి విషయాలు దాచేస్తారు. మీడియా రాస్తే వాటిని తప్పు అని చెప్తారు. కానీ శృతి హాసన్ అలా కాదు. తాజాగా ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో తన పద్దతి గురించి మాట్లాడింది.
“నేను టీనేజ్ లో ఉన్నప్పుడు నా ముక్కుని చూసి నాకే నచ్చేది కాదు. సో సర్జరీ చేయించుకున్నాను. ఫేస్ మరింత అందంగా కనిపించేందుకు ఫిల్లర్స్ కూడా వాడాను. ఇందులో దాచుకునేదేమి లేదు. కొందరు ఇలాంటి విషయాలు బయటికి చెప్పొద్దు అంటారు. వాటిని దాచేస్తారు. వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవిస్తాను. కానీ చెప్పుకునే వాళ్ళని కూడా తప్పుపట్టొద్దు.
రేప్పొద్దున వయసు పెరిగాక ఫేస్ లిఫ్ట్ చేసుకుంటానా అని అడిగితే ఏమో చెప్పలేం. చేసుకుంటానేమో. ఇది పూర్తిగా వ్యక్తిగత ఛాయిస్. నా బాడీ నా ఇష్టం. ఇతరులకు ఇబ్బంది లేనప్పుడు దాన్ని ప్రశ్నించొద్దు,” ఇది శృతి హాసన్ వైఖరి.
ప్రస్తుతం ఈ భామకి 39 ఏళ్ళు. ఇంకా పెళ్లి కాలేదు. శృతి హాసన్ చేతిలో “కూలి”, “సలార్ 2” ఉన్నాయి. ‘కూలి’ సినిమాలో రజినీకాంత్ కి కూతురిగా నటిస్తున్నట్లు టాక్. ‘సలార్ 2’ వచ్చే ఏడాది విడుదల అవుతుంది.
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…
తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…