హీరో వరుణ్ తేజ్ (Varun Tej) ప్రస్తుతం కొరియాలో ఉన్నాడు. కొరియన్ కనకరాజ్ (Korean Kanakaraju) అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ షూటింగ్ కోసం కొరియా వెళ్ళాడు. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకొంది. మరో రెండు, మూడు నెలల్లో ఈ సినిమా విడుదల అవుతుంది. ఆ తర్వాత ఏ సినిమా చేస్తాడు?
వరుణ్ తేజ్ ఇటీవల నటించిన సినిమాలు ఏవీ ఆడలేదు. వరుసగా మూడు, నాలుగు సినిమాలు పోయేసరికి వరుణ్ కి క్రేజ్ తగ్గింది. మార్కెట్ కూడా పడిపోయింది. ఈ ‘కొరియన్ కనకరాజ్’తో పాటు మరో రెండు సినిమాలు ఆడితేనే అతని కెరీర్ ట్రాక్ లో పడుతుంది. అందుకే అతని తదుపరి సినిమాలపై ఫిలిం ఇండస్ట్రీ ఫోకస్ పెట్టింది.
ప్రస్తుతం ఈ సినిమా తర్వాత ఏ సినిమాలు చెయ్యాలి అనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు కానీ పలువురు దర్శకులు అతన్ని అప్రోచ్ అవుతున్నారు. ఇటీవల ప్రభాస్ తో “ది రాజాసాబ్” సినిమా తీసి దారుణమైన పరాజయం చూసిన మారుతి ఇప్పటికిప్పుడు తనకి డేట్స్ ఇచ్చే హీరో వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ మాత్రమే అని భావిస్తున్నాడట. ముఖ్యంగా వరుణ్ తేజ్ ని ఒప్పించి వచ్చే సంక్రాంతికి సినిమా విడుదల అయ్యేలా ప్లాన్ చేసుకుందామని ప్రయత్నిస్తున్నాడు.
హీరో ఒప్పుకోకముందే ఈ సినిమాకి “హ్యాపీ పొంగల్” అనే పేరు కూడా ఫిక్స్ చేసుకున్నాడు. మరి జనంతో తెగ ట్రోలింగ్ పొందిన మారుతితో ఇప్పుడు వరుణ్ తేజ్ రిస్క్ తీసుకుంటాడా?
లేక ఇటీవల కమిటీ కుర్రాళ్ళు సినిమాతో పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు యదు వంశీ చెప్పిన స్పోర్ట్స్ డ్రామా ఒప్పుకుంటాడా అనేది చూడాలి.
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…