మెగాస్టార్ చిరంజీవికి సంక్రాంతి పండుగ మరోసారి కలిసి వచ్చింది. ఈ సంక్రాంతికి విడుదలైన “మన శంకర వర ప్రసాద్ గారు” పెద్ద హిట్ అయింది. కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు పొందిన చిత్రంగా నిలిచింది.
అంతకుముందు కూడా హిట్ వచ్చింది సంక్రాంతి సినిమాతో. “వాల్తేర్ వీరయ్య” సినిమా 2023 సంక్రాంతికి విడుదలై పెద్ద విజయం సాధించింది. అందుకే, ఇప్పుడు ఇదే సెంటిమెంట్ తో మరో సంక్రాంతికి సినిమాని టార్గెట్ చేస్తున్నారట.
ప్రస్తుతం చిరంజీవి “విశ్వంభర” సినిమా విడుదల కోసం చూస్తున్నారు. ఇది జులైలో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇక మార్చి నుంచి బాబీ డైరెక్షన్లో కొత్త సినిమాని స్టార్ట్ చేస్తారు. సంక్రాంతి 2027కి ఈ సినిమాని విడుదల చెయ్యాలంటే 9 నెలల్లో సినిమాని పూర్తి చెయ్యాలి. అనుకుంటే బాబీ పూర్తి చెయ్యగలడు. ఐతే, 2026 జనవరికి “మన శంకర వర ప్రసాద్ గారు” విడుదల చేసిన చిరంజీవి జులైలో “విశ్వంభర” విడుదల చేసి మళ్ళీ వెంటనే ఇంకో సినిమాని రిలీజ్ చేస్తారా అనేది చూడాలి.
కానీ సీజన్ మిస్ ఐతే పెద్ద హిట్ కొట్టడం అంత సులువు కాదు. అందుకే, సంక్రాంతి 2027ని టార్గెట్ చేస్తూనే షూటింగ్ చెయ్యాలని భావిస్తున్నారట. ఆ డేట్ కి విడుదల అవుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం.
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…