తన సినిమాలో చిరంజీవి పాత్రపై స్పందించాడు అనీల్ రావిపూడి. కామెడీ టైమింగ్ లో చిరంజీవి నెక్ట్స్ లెవెల్ అని తెలిపిన అనీల్ రావిపూడి.. కొత్త సినిమాలో తన మార్క్ కామెడీ ఉంటూనే, మెగాస్టార్ స్టయిల్ కనిపిస్తుందని అంటున్నాడు.
“చిరంజీవి కామెడీ చేస్తే ఎలా ఉంటుందో, ఇంతకుముందు కొన్ని సినిమాల్లో చూశాం. ఈ సినిమాలో నెక్ట్స్ లెవెల్ చూస్తారు. సినిమాలో నా టైపు సిచ్యుయేషన్ కామెడీ ఉంటుంది. దానికి చిరంజీవి మార్కు కామెడీ టచ్ ఉంటుంది. నా స్క్రిప్ట్ ను చిరంజీవి బాగా ఎడాప్ట్ చేసుకున్నారు. గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, చంటబ్బాయ్ సినిమాల్లో సిచ్యుయేషన్ కామెడీ ఎలా ఉంటుందో, నా సినిమాలో అలానే ఉంటుంది.”
ఇలా తన సినిమాలో చిరంజీవి క్యారెక్టరైజేషన్ ను బయటపెట్టాడు అనీల్ రావిపూడి. సినిమాలో యాక్షన్, డ్రామాతో పాటు చిరంజీవి నుంచి కామెడీ కూడా చూస్తారని అంటున్నాడు. ఇక వెంకటేష్ ఎంట్రీపై కూడా స్పందించాడు.
చిరంజీవి సినిమాలో వెంకీ పాత్ర ఇలా వచ్చి అలా వెళ్లిపోయేలా గెస్ట్ రోల్ తరహాలో ఉండదని స్పష్టం చేశాడు రావిపూడి. అతిథి పాత్ర కంటే ఎక్కువగా వెంకటేష్ పాత్ర ఉంటుందని.. చిరు-వెంకీ కాంబినేషన్ లో సన్నివేశాలు కూడా ఉంటాయని స్పష్టం చేశాడు రావిపూడి.
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…