తమిళ హీరో విక్రమ్ (Chiyaan Vikram) పని అయిపోయింది. ఇక అతని కెరీర్ ఎండ్ అయింది. హీరోగా సినిమాలు చెయ్యడం మానేసి విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రయత్నాలు చెయ్యాలి.
ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి ఈ మధ్య. దానికి కారణం ఉంది. సోలో హీరోగా విక్రమ్ నటించిన చిత్రాలేవీ ఈ గత పదేళ్లలో ఆడలేదు. పొన్నియన్ సెల్వన్ బాగా ఆడింది. కానీ అందులో అతను సోలో హీరో కాదు. 2015లో వచ్చిన “ఐ”, 2016లో వచ్చిన “ఇరు మగన్” చిత్రాలే అతనికి హీరోగా హిట్స్. ఆ తర్వాత అన్ని ఫ్లాపులే. అందుకే, అలాంటి కామెంట్స్ వచ్చాయి.
నిర్మాతలు, పెద్ద దర్శకులు కూడా విక్రమ్ ని అప్రోచ్ అవ్వడం మానేశారు. దాంతో ఏడాదిపాటు మేకప్ వేసుకోకుండా ఇంట్లోనే కూర్చున్నాడు. ఈ గ్యాప్ లో అతని కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా మొదటి హిట్ అందుకున్నాడు. దాంతో విక్రమ్ కి కొడుకు కెరీర్ గురించి బెంగ పోయింది. అందుకే ఇప్పుడు మళ్ళీ హీరోగా రీ-ఎంట్రీ ఇస్తాడట.
కొత్తగా నాలుగు సినిమాలు ఒప్పుకున్నాను. ఏడాది గ్యాప్ తర్వాత కెరీర్ రీ సెట్ చేస్తున్నాను. నలుగురు దర్శకులు నాకు నచ్చిన వాళ్లే,” అని విక్రమ్ తన ఇన్ స్టాగ్రామ్ లో రాసుకున్నాడు. సో విక్రమ్ మళ్ళీ హీరోగా కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నాడు.
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…
ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…