సంక్రాంతి బరిలో రిలీజైన ‘డాకు మహారాజ్’ సినిమా తను ఆశించిన స్థాయిలో ఆడలేదనే విషయాన్ని నిర్మాత నాగవంశీ ఒప్పుకున్నాడు. అయితే ఆ సినిమా తనకు సంతృప్తినిచ్చిందన్నాడు.
“డాకు మహారాజ్ సంక్రాంతికి ఏ ఏరియాల్లో బాగా ఆడుతుందని ఊహించామో, ఆ ఏరియాలన్నింటిలో బాగా ఆడింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో, వెంకటేష్ సినిమా లీడ్ తీసుకుంది. దీంతో ‘డాకు మహారాజ్’ తగ్గింది. మా వెంకటేష్ కు, దిల్ రాజుకు హిట్ రావడం హ్యాపీ. డాకు సక్సెస్ తో నేను కూడా హ్యాపీగానే ఉన్నాను కానీ అనుకున్నంత స్థాయికి వెళ్లలేదు.”
ఇలా బాలకృష్ణ నటించిన సినిమా సంక్రాంతి బరిలో సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదనే విషయాన్ని బయటపెట్టాడు నాగవంశీ. ఈ సినిమాకు బాలకృష్ణ మార్కెట్ కు మించి ఖర్చు చేశామని విడుదలకు ముందే చెప్పుకొచ్చాడు ఈ నిర్మాత. ఆ లెక్కన చూసుకుంటే, సినిమా కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అవ్వలేదని అర్థం.
అటు ‘లక్కీ భాస్కర్’ విషయంలో కూడా ఒకింత నిరాశ చెందాడు నాగవంశీ. థియేటర్లలో ఆశించిన స్థాయి రెవెన్యూ రాలేదని, కాస్త నిరాశగా ఉన్నప్పటికీ, కొత్త జానర్ ట్రై చేశాం కాబట్టి కలెక్షన్లు తగ్గుతాయని, పరిమిత ప్రేక్షకులుంటారని తమకు ముందే తెలుసని అంటున్నాడు.
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…
రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) రిలీజ్…
పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…