బాలీవుడ్ అగ్ర హీరోయిన్ దీపిక పదుకోన్ ఇప్పుడు ఏడు నెలల గర్భవతి. సెప్టెంబర్లో ఆమెకి డెలివరీ డేట్ ఇచ్చారు డాక్టర్లు. మొన్నటి వరకు తన బేబీ బంప్ ని చూపించేందుకు చాలా అవస్థలు పడింది. కానీ ఇప్పుడు గర్వంగా తన బంప్ ని చూపిస్తోంది.
ఇటీవల అంబానీ కొడుకు పెళ్ళి సంబరాలకు దీపిక పదుకోన్ తన భర్త రణ్వీర్ సింగ్ తో కలిసి వచ్చింది. చీరలో ఆమె బేబీ బంప్ పెద్దగా కనిపించింది. ఆ ఫోటోలను షేర్ చేసింది. అలాగే సోషల్ మీడియా సెలేబ్రిటిగా పేరొందిన Orryతో కలిసి ఈ జంట ఆ పెళ్లి వేడుకలో దిగిన ఫోటో బాగా వైరల్ అయింది.
దీపిక ఇటీవల “కల్కి 2898 AD” సినిమాలో నటించింది. అందులో కూడా ఆమెది గర్భవతి పాత్రే. తల్లి కావాలనుకునే సుమతి అనే యువతిగా నటించింది. “కల్కిలో దీపికని గర్భంతో చూసినప్పుడు విచిత్రంగా అనిపించింది. రియల్ లైఫ్, రీల్ లైఫ్ కలిసిపోయిన సర్రియల్ అనుభూతి కలిగింది,” అని ఇటీవల ఆమె భర్త రణ్వీర్ సింగ్ అన్నాడు.
దీపిక నటించిన “సింగం అగైన్” అనే చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఆమె ఇంకా కొత్తగా సినిమాలు ఒప్పుకోలేదు.
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…