ధనుష్ కేవలం నటుడు మాత్రమే కాదు. అతడు మంచి దర్శకుడు కూడా. మినిమం గ్యాప్స్ లో సినిమాలకు డైరక్షన్ చేస్తుంటాడు. తాజాగా కూడా ఓ సినిమాను డైరక్ట్ చేశాడు. ఇప్పుడీ నటుడు కమ్ డైరక్టర్, పవన్ కల్యాణ్ పై ఫోకస్ పెట్టాడు.
పవన్ కల్యాణ్ ను తన డ్రీమ్ హీరోగా చెప్పుకొచ్చాడు ధనుష్. ఛాన్స్ వస్తే తెలుగులో పవన్ కల్యాణ్ ను డైరక్ట్ చేయాలనుకుంటున్నట్టు వెల్లడించాడు.
ధనుష్ చెప్పిన ఈ సమాధానంతో ‘కుబేర’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ హాల్ మొత్తం దద్దరిల్లిపోయింది. ఈ సందర్భంగా మరికొన్ని అంశాలపై కూడా స్పందించాడు ధనుష్.
అందరికీ ఉన్నట్టే, ఒకటో తారీఖు కష్టాలు తనకు కూడా ఉన్నాయన్నాడు. 150 రూపాయలు సంపాదిస్తే, 200 రూపాయలు కష్టాలుంటాయని, కోటి రూపాయలు సంపాదిస్తే, 2 కోట్ల రూపాయల సమస్యలుంటాయని అన్నాడు.
డబ్బు లేకపోయినా అమ్మ ప్రేమ దక్కుతుందంటున్న ధనుష్… ‘కుబేర’ సినిమాలో తను 3 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషించానని వెల్లడించాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా.
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…