నాగ చైతన్య, శోభిత ధూళిపాళ డేటింగ్ లో ఉన్నారని సినిమా జనాలు చాలా కాలంగా కోడై కూస్తున్నారు. ఆ మధ్య ఇద్దరూ కలిసి లండన్ వీధుల్లో చెట్టాపట్టాలేసుకొని తిరిగినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరూ ఒక చోట కనిపించలేదు. కెమెరా కంటికి చిక్కలేదు. దాంతో, ఆ డేటింగ్ వార్తలు మరుగున పడ్డాయి.
ఐతే, తాజాగా వీళ్ళు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చెయ్యడంతో మళ్ళీ వీరి డేటింగ్ మేటర్ పై చర్చ మొదలైంది.
శోభిత రెండు రోజుల క్రితం తన వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది. ఆమె ఒక జీపులో ప్రయాణిస్తున్న ఫోటోలు అవి. ఆమె ఎక్కడ విహార యాత్రకు వెళ్ళింది తెలపలేదు. కానీ ఆ ఫోటోలను బట్టి జనం ఆమె Tipeshwar Wildlife Sanctuaryలో వెకేషన్ గడిపింది అని తీర్మానించారు.
ఇక నిన్న (ఏప్రిల్ 21) నాగ చైతన్య సూర్యాస్తమయాన్ని ఎంజాయ్ చేస్తున్న ఫోటోని షేర్ చేశాడు. అతను కూడా ఎక్కడ సేదదీరుతున్నది రాయలేదు. కానీ నాగ చైతన్య ఉన్న రిసార్ట్ లుక్, శోభిత ఉన్న రిసార్ట్ లుక్ ఒకే తీరుగా ఉన్నాయి అని ఇన్ స్టాగ్రామ్ జనాలు ఫిక్స్ అయిపోయారు. అన్న శోభితతోనే ఉన్నావు కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
“గ్యాప్”లో ఇలా
ప్రస్తుతం నాగ చైతన్య “తండేల్” అనే సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ గ్యాప్ దొరికింది. వచ్చే నెలలో షూటింగ్ మళ్ళీ మొదలవుతుంది. అప్పటివరకు ఇలా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు ఉంది. ఇక శోభిత మొన్నటివరకు తన హాలీవుడ్ మూవీ “మంకీ మేన్” సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఇటీవలే ఇండియాకి వచ్చింది. ఈ అమ్మడు కూడా ఇప్పుడు ఇలా వెకేషన్ లో ఉంది.
ఐతే శోభిత, నాగ చైతన్య నిజంగా ఒకే చోట వెకేషన్ కి వెళ్ళారా? ఆ రెండు ఫోటోలు ఒకే చోటుకు సంబంధించినివా అనేది చెప్పలేం.
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…