దిల్ రాజుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఓవైపు డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్ అవుతూనే, మరోవైపు నిర్మాతగా ఆయన ఫెయిల్యూర్స్ చూస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి ‘జనక అయితే గనక’ సినిమా కూడా చేరింది.
దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుహాస్ హీరోగా నటించిన ఈ సినిమాపై నిర్మాత చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఈ దసరాకు కుటుంబమంతా కలిసి చూడదగ్గ చక్కటి చిత్రంగా ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు.
కానీ కండోమ్ చుట్టూ తిరిగే ఈ కథను ఎంత సంప్రదాయబద్ధంగా తీసినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చుకోలేదు. అలా దసరా సినిమాల్లో అన్నింటికంటే ముందుగా ఫెయిలైంది ‘జనక అయితే గనక’ సినిమా.
దిల్ రాజుకు ఈ ఏడాది నిర్మాతగా పెద్దగా కలిసిరాలేదు. ప్రారంభంలో ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్ చేశాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత తన కుటుంబ హీరో ఆశిష్ ను పెట్టి ‘లవ్ మీ’ తీశాడు. అది కూడా ఫెయిలైంది. ఇప్పుడు ‘జనక అయితే గనక’ కూడా ఫెయిల్యూర్ లిస్ట్ లో చేరింది.
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…