న్యూస్

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఎంటర్ టైనర్!

మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ రేపు విడుదల కానుంది. ఈ సినిమా గురించి దర్శకుడు చెప్తున్న ముచ్చట్లు

భర్త మహాశయులకు విజ్ఞప్తి కథ ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు కథలా అనిపిస్తోంది.

ఒక భర్త తన అనుభవం వల్ల మిగతా భర్తలకి ఏం చెప్తున్నాడు.. తను ఎలాంటి స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాడు అనేది కథలోని ప్రధాన అంశం. ఇందులో ఇద్దరు అమ్మాయిలు అడిగిన ప్రశ్న పెళ్లయిన వాళ్ళందరికీ కూడా ఎప్పుడో ఒక సమయంలో ఎదుర్కొన్నదే. అలాంటి ప్రశ్న అడిగినప్పుడు వెంటనే ఏం సమాధానం చెప్పాలనేది తెలీదు. ఆ ప్రశ్న నిజంగా చాలా కఠినమైనది. మన కోపాన్ని అవతల వాళ్ళని ప్రశ్నించడంలో కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కథని చేసుకోవడం జరిగింది. ప్రశ్నలోనే అన్నిటికంటే పెద్ద పనిష్మెంట్ ఉంటుంది. అది ఏంటనేది ఆడియన్స్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఈ కథని ఇల్లాలు ప్రియురాలు కోణంలో కాకుండా చాలా డిఫరెంట్ గా ట్రీట్ చేయడం జరిగింది. ఇది చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్.

ఈ సినిమా ప్రమోషన్స్ లో డాన్స్ చేశారు కదా అంత జోష్ ఎలా వచ్చింది?

ఈ రోజుల్లో సినిమా తీయడం ఒక ఎత్తు ఆ సినిమాని ప్రచారం చేయడం కూడా మరో ముఖ్య అంశం. ప్రమోషన్స్ అని కాదు గాని నాకెందుకో ఆ జోష్ అనిపించి డాన్స్ చేశాను. నేను చాలా హ్యాపీగా చేసిన డాన్స్ అది. ఈ సినిమాలో సత్య నటించిన ఒక పాటకి కొరియోగ్రఫీ కూడా చేశాను. అదొక చిన్న బిట్ సాంగ్. ఆ పాట ఎంటర్టైనింగ్ గా ఉంటుంది.

ఈ కథకి ముందు రవితేజ గారిని అనుకున్నారా?

అవునండి. రవితేజ గారితో చేద్దామని అనుకున్న తర్వాతే కథని డెవలప్ చేయడం జరిగింది. ఆయన దగ్గర చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే ఈ సినిమా స్క్రిప్టు చక్కగా వచ్చిన విధానం చూసి ముందు ఈ సినిమానే చేద్దామని అన్నారు. సినిమా చేస్తున్నప్పుడు రవితేజ గారు చాలా ఎంజాయ్ చేశారు. రామ్ సత్యనారాయణ క్యారెక్టర్ నేనేదైతే రాశానో దాన్ని ఫాలో అయ్యారు. నాకోసం అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నేను అదే చేస్తానని చెప్పారు. మీరు స్క్రీన్ మీద చూస్తే రవితేజ గారు చాలా ఫ్రెష్ గా ఉంటారు. ఈ సినిమా విషయంలో ఆయన ఇచ్చిన కొన్ని ఇన్పుట్స్ కూడా తీసుకున్నాను. రవితేజ గారు సినిమా చాలాసార్లు చూశారు. మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. ఆడియన్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు

హీరోయిన్స్ గురించి?

ఆషికా, డింపుల్.. ఇద్దరి క్యారెక్టర్ లో డిఫరెంట్ గా ఉంటాయి. ఇద్దరికీ మంచి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది. ఆషికా పెర్ఫార్మెన్స్ స్ట్రాంగ్ గా ఉంటుంది. డింపుల్ కూడా ఇప్పటివరకు కనిపించని ఒక డిఫరెంట్ రోల్ లో కనిపించబోతున్నారు.

ఇక నిర్మాత సుధాకర్ గారు ఒక నిర్మాత కంటే నాకు ఒక బ్రదర్ ఫ్రెండ్ లాంటి వ్యక్తి. ఆయన ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని నిర్మిస్తారు. చాలా సపోర్ట్ చేస్తారు. సినిమా బాగుండాలి బాగా రావాలని తపనపడే నిర్మాత.

మిరాయ్ సినిమాలో నటించారు కదా. ఇక నటుడిగా కొనసాగుతారా?

డైరెక్టర్ కార్తీక్ నాకు చాలా క్లోజ్. ఆ సినిమా చేయడం తర్వాత ఒక యాక్టర్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ చేసుకున్నాను. నచ్చిన క్యారెక్టర్ వస్తే మనకు ఇష్టమైన డైరెక్టర్ అయితే నటనని కొనసాగించవచ్చు. ఆ సినిమా పార్ట్ 2 లో కూడా నేను ఉండే అవకాశం ఉంది.

కొత్త ప్రాజెక్ట్స్ గురించి?

రెండు మూడు కథలు ఉన్నాయి. డివోషనల్ మైథాలజీలో ఒక స్క్రిప్టు. అలాగే మున్నా భాయ్ లాంటి సోషల్ సెటైర్ కథ ఉంది. అయితే ఏది ముందుగా చేయాలనేది త్వరలోనే తెలియజేస్తాను.

TeluguCinema

Recent Posts

ఇదే నా మొదటి సినిమా: Preity Mukhundhan

ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan) ... తెలుగులో ఆమె మొదటి సినిమా 'కన్నప్ప'. అలాగే ఆమె నటించిన 'బ్లాస్ట్' (Blast)…

12 minutes ago

Konidela Surekha ఒక్కసారైనా యాదగిరిగుట్టకి వెళ్ళారా?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట (Yadagiri Gutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన…

14 hours ago

ఆ 15 నిమిషాల కోసం Nagabandham చేశాడంట!

'నాగబంధం' (Nagabandham) సినిమాలో నటీనటులు చిన్నవాళ్లు. దర్శకుడు కూడా కొత్త. మొన్నటివరకు అంచనాలు కూడా తక్కువే. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో,…

14 hours ago

Neha Dhupia: ‘వెనకనుంచి తీయొద్దురా బాబు’, పాపరాజీపై మండిపాటు

బాలీవుడ్ నటి నేహా ధూపియా (Neha Dhupia) ఇటీవల ఓ అవార్డు కార్యక్రమంలో పాపరాజీపై అసహనం వ్యక్తం చేశారు. ఫొటోగ్రాఫర్లు…

15 hours ago

Tripti Dimri: ‘స్పిరిట్’ భామ ఖాతాలో ఇంకో ఘనత

"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…

24 hours ago

Kayadu Lohar: రాయితో బుర్ర పగలగొట్టిన హీరోయిన్

హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…

1 day ago