మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందిన “మన శంకరవరప్రసాద్ గారు” బాక్సాఫీస్ వద్ద పాస్ అయిపొయింది. ప్రసాద్ ఏకంగా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు. మొదటి రెండు రోజుల కలెక్షన్లతో టీం అంతా ఆనందంగా ఉంది.
ప్రభాస్ నటించిన “ది రాజా సాబ్,” రవితేజ నటించిన “భర్త మహాశయులకు విజ్ఞప్తి” విడుదల అయ్యాయి. అయినా ప్రసాద్ కి కలెక్షన్లు గట్టిగానే ఉన్నాయి. మొదటి చాయిస్ గా సినిమా నిలుస్తోంది.
ఈ సినిమా కలెక్షన్లకు ప్రధాన బలం… ఫ్యామిలీ ఆడియెన్స్. ఇక అసలైన సంక్రాంతి పండుగ ఆంధ్రాలో రేపు భోగి నుంచి మొదలవుతుంది. భోగి, సంక్రాంతి, కనుమ కలెక్షన్లు మాములుగా ఉండవు. ఆ తర్వాత శనివారం, ఆదివారం వస్తున్నాయి. అంటే వచ్చే ఐదు రోజులు కలెక్షన్ పండుగే.
మెగాస్టార్ చిరంజీవికి ఇది పెద్ద రిలీఫ్. భోళా శంకర్ లాంటి డిజాస్టర్ తర్వాత మంచి హిట్ పడింది. ఐతే, ఈ సినిమా ఓవరాల్ కలెక్షన్ల గురించి ఇప్పుడే చెప్పడం కష్టం. కానీ పక్కాగా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది అని చెప్పొచ్చు.
“మన శంకర వర ప్రసాద్ గారు” చిత్రంలో చిరంజీవి సరసన నయనతార నటించింది. వెంకటేష్ ఒక కీలక పాత్ర పోషించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట (Yadagiri Gutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన…
'నాగబంధం' (Nagabandham) సినిమాలో నటీనటులు చిన్నవాళ్లు. దర్శకుడు కూడా కొత్త. మొన్నటివరకు అంచనాలు కూడా తక్కువే. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో,…
బాలీవుడ్ నటి నేహా ధూపియా (Neha Dhupia) ఇటీవల ఓ అవార్డు కార్యక్రమంలో పాపరాజీపై అసహనం వ్యక్తం చేశారు. ఫొటోగ్రాఫర్లు…
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…