‘మీర్జాపూర్’ సిరీస్ తో నటుడు దివ్యేందు శర్మ బాగా పాపులర్ అయ్యాడు. ఈ నటుడు ఇప్పుడు తెలుగులో నటిస్తున్నాడు. అతని మొదటి తెలుగు చిత్రం.. పెద్ది. రామ్ చరణ్, బుచ్చి బాబు సానా కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం… పెద్ది.
ఈ రోజు దివ్యేందు శర్మ పుట్టిన రోజు. అతనికి బర్త్ డే విషెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ‘రామ్ బుజ్జి’ అనే క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు దివ్యేందు శర్మ. ఈ పోస్టర్లో క్రికెట్ బంతిని ఎగరేస్తూ కనిపించాడు దివ్యేందు శర్మ.
ఇంతకుముందు రామ్ చరణ్ మొదటి లుక్ వీడియో, ఇప్పుడు దివ్యేందు పోస్టర్ ని బట్టి చూస్తే “పెద్ది” ప్రధానంగా క్రికెట్ చుట్టూ తిరిగే కథ అనిపిస్తోంది.
ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతి బాబు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.
“పెద్ది”ని వచ్చే ఏడాది మార్చి 27న విడుదల చెయ్యనున్నారు.
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…