సినిమా బాగుంటే ఒకేసారి 2-3 సినిమాల్ని కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని దర్శకనిర్మాతలు తరచుగా చెబుతుంటారు. అయితే ప్రతిసారి వాళ్లు చెప్పినట్టు జరగదు. ఇది చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంటుంది. అప్పుడెప్పుడో “బింబిసార”, “కార్తికేయ-2” టైమ్ లో ఓసారి జరిగింది. మళ్లీ ఇన్నాళ్లకు దీపావళి బరిలో ఆ మేజిక్ రిపీట్ అయింది.
ఈ దీపావళికి ‘క’, ‘లక్కీ భాస్కర్’, ‘అమరన్’, “భగీర” సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో 3 సినిమాలకు మంచి టాక్ రావడం చెప్పుకోదగ్గ విషయం.
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన సినిమా ‘క’. ఈ సినిమాలో పాయింట్ కొత్తగా అనిపించకపోతే ఇక సినిమాలు చేయనంటూ చాలా పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చాడు కిరణ్. అతడి ధైర్యమే నిజమైంది. ‘క’ సినిమా మాస్ జనాలకు ఎక్కింది. ప్రస్తుతం కలెక్షన్లు బాగున్నాయి.
ఇక దుల్కర్ సల్మాన్ నటించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా కూడా దీపావళి బరిలో క్లిక్ అయింది. బ్యాంకింగ్ నేపథ్యంలో కొత్త పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా మల్టీప్లెక్స్ ఆడియన్స్ కు బాగా నచ్చింది. కేరళలో సూపర్ హిట్టయిన ఈ సినిమా, తెలుగులో ఎబో ఏవరేజ్ గా ఆడుతోంది.
బరిలో నిలిచిన మరో సినిమా ‘అమరన్’. శివ కార్తికేయిన్ హీరోగా నటించిన ఈ సినిమా తమిళ్ లో పెద్ద హిట్టయింది. ఎందుకంటే, శివ కార్తికేయన్ అక్కడ పెద్ద హీరో. అయితే తెలుగులో కూడా ఇతడికి ఈమధ్య మార్కెట్ క్రియేట్ అయింది. పైగా ఇందులో సాయి పల్లవి కూడా ఉంది. అందుకే తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి.
అక్కినేని అఖిల్ (Akhil Akkineni), జైనబ్ (Zainab Ravdjee) 2025 జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన వెంటనే ఈ…
రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇరుముడి’ (Irumudi) చిత్రంపై ఇటీవల సోషల్ మీడియాలో నెలకొన్న సందేహాలకు తెరపడింది. బుక్‌మైషోలో…
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ నిజమైన బ్లాక్‌బస్టర్ అని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఏరియాల్లో…
దర్శకుడు ఎం.ఎస్. రాజు రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘అగధ’ (Agadha). ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు టీం ఆదివారం ఘనంగా…
ధనుష్ (Dhanush) హీరోగా ఆర్ టేక్ స్టూడియోస్, వండర్‌బార్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ చిత్రానికి ‘ఓం: చాప్టర్ 1’…
జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) మొదటి చిత్రం… 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ నెల 30న విడుదల…