3-4 రోజుల్లో కథ పూర్తిచేయడమే కాదు.. అంతే వేగంగా హీరోల నుంచి ఓకే కూడా చెప్పించుకుంటాడు దర్శకుడు పూరి జగన్నాధ్. ఇతడి టాలెంట్ ఇది. ఏ హీరోనైనా సింగిల్ సిట్టింగ్ లో కథ చెప్పి, ఓకే చేయించుకోగల సత్తా ఉన్న దర్శకుడు ఇతడు.
తాజాగా ఈ దర్శకుడి టాలెంట్ కు సంబంధించి ఆసక్తికర విషయం ఒకటి బయటకొచ్చింది. డబుల్ ఇస్మార్ట్ సినిమాలో విలన్ గా నటించాడు సంజయ్ దత్. ఇతడి కాల్షీట్ల కోసం చార్మి, పూరి చాలా టెన్షన్ పడ్డారు. ఈ సంగతి పక్కనపెడితే.. సంజయ్ దత్ ను పూరి ఎలా ఒప్పించాడనేది ఇప్పుడు మేటర్.
సంజయ్ దత్ ను కలిసి కేవలం 10 నిమిషాలు అతడు చేయాల్సిన బిగ్ బుల్ పాత్రను వివరించాడట పూరి జగన్నాధ్. అంతే, ఆ 10 నిమిషాల నెరేషన్ కే సంజయ్ దత్ ఓకే చెప్పాడట. అంతేకాదు. ఆ క్యారెక్టర్ బాగా నచ్చడంతో, ఆ రాత్రి పూరి-చార్మికి పెద్ద పార్టీ కూడా ఇచ్చాడంట.
అలా 10 నిమిషాల్లో సంజూ బాబాను ఒప్పించిన పూరి జగన్నాధ్, ఆ తర్వాత అతడి కాల్షీట్లు దొరకబుచ్చుకోవడానికి మాత్రం చాలా కష్టపడ్డాడట. అందుకే ఎందుకైనా మంచిదని, ఫస్ట్ షెడ్యూల్ లోనే రామ్, సంజయ్ దత్ మధ్య క్లైమాక్స్ పార్ట్ షూట్ చేశారట.
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…
తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…