ఇటీవల మంచి విజయం సాధించిన చిత్రం… “మహారాజా”. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమాకి ప్రశంసలు బాగా దక్కాయి. ఈ సినిమాని డైరెక్ట్ చేసిన నిథిలన్ స్వామినాథన్ ని సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంటికి పిలిపించుకొని మరీ అభినందించారు. స్క్రీన్ ప్లే అదరగొట్టావు అని మెచ్చుకున్నారు రజినీకాంత్.
చాలామంది హీరోలకు, హీరోయిన్లకు ఈ దర్శకుడి ప్రతిభ నచ్చింది. అందుకే కథ ఉంటే చెప్పు మనం సినిమా చేద్దాం అని పలువురు స్టార్స్ అతనికి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. అలాంటి వారిలో నయనతార ఒకరు. ఆమె సినిమా చేద్దామని చెప్పగానే “మహారాజా”కి సీక్వెల్ గా “మహారాణి” అనే స్క్రిప్ట్ వినిపించారట నిథిలన్. ఇది పూర్తిగా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం అన్నమాట.
నయనతారకి ఈ ఐడియా నచ్చిందట. వెంటనే సినిమా చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఐతే, ఇది వెంటనే ఉంటుందా లేక ఆ దర్శకుడు మరో సినిమా చేసిన తర్వాత నయనతార సినిమాని టేకప్ చేస్తాడా అన్నది చూడాలి.
నయనతార కూడా సోలో హీరోయిన్ గా ఒక మంచి హిట్ కావాలని చూస్తోంది. ఇటీవల ఆమె హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు అంతగా ఆడడం లేదు. బాలీవుడ్ లో నటించిన “జవాన్” పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. కానీ అది పూర్తిగా షారుక్ ఖాన్ ఖాతాలోనే పడింది. తనకి సొంతగా హిట్ కావాలి. సూపర్ స్టార్ అన్న పేరుని నిలబెట్టుకోవాలంటే హీరోయిన్ గా పెద్ద హిట్స్ ఇవ్వాలి మరి.
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…