సాయిపల్లవి (Sai Pallavi) పుట్టినరోజు నాడు అంతా ఎదురుచూసిన లుక్, ‘రామాయణ’ (Ramayana) నుంచి ఆమె సీత లుక్. కానీ ఆమె ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులందరికీ నిరాశే ఎదురైంది. రోజంతా ఎదురుచూసినవాళ్లు మరింత డిసప్పాయింట్ అయ్యారు.
నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా సీతగా ఆమె లుక్‌ను విడుదల చేయకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇలాంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో కీలక పాత్రధారుల లుక్స్ ను సాధారణంగా పుట్టినరోజున విడుదల చేస్తుంటారు. సాయి పల్లవి విషయంలో అది జరగలేదు.
ఇప్పటికే చాలామంది సీత పాత్రలో కనిపించారు. సాయిపల్లవి ఆ పాత్రలో ఎలా సెట్ అయిందో చూడాలని చాలామందికి ఉంది. కానీ ఆ ఉత్సహాన్ని మేకర్స్ నీరుగార్చారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా లుక్ రిలీజై ఉంటే, ప్రాజెక్టుకు సౌత్ లో మంచి క్రేజ్ వచ్చి ఉండేది. ఆ అవకాశం మిస్సయింది.
రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి విడుదల చేయబోతున్నారు. ఇంత పెద్ద స్టార్ కాస్ట్, ఇంత భారీ బడ్జెట్ ఉన్నప్పటికీ, సినిమా ప్రచారం విషయంలో మేకర్స్ ఆచితూచి వ్యవహరించడంతో రిలీజ్ పై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ఇటీవల ఈ సినిమాకు సంబంధించి విడుదలైన చిన్న గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. ఇలాంటి సమయంలో సాయి పల్లవి లుక్‌ను విడుదల చేసి ఉంటే, సినిమాకు మళ్లీ మంచి బజ్ వచ్చి ఉండేది.
హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh) తెగ హడావిడి చేస్తోంది. సినిమాకి ఎంత ప్రచారం చెయ్యాలన్నా చేస్తాను అన్నట్లు "నాగబంధం"…
ఈ దసరా పండక్కి (Dasara 2026) రెండు పెద్ద సినిమాలు పోటీ పడేలా ఉన్నాయి. ఒక పెద్ద సినిమాకి అధికారికంగా…
మాళవిక మోహనన్ అంటేనే గ్లామర్ షో అని చెప్పాలి. ఆమె అందాల ఆరబోతలో అస్సలు సిగ్గుపడదు. ఇక ఇప్పుడు మాల్దీవుల్లో…
ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan) ... తెలుగులో ఆమె మొదటి సినిమా 'కన్నప్ప'. అలాగే ఆమె నటించిన 'బ్లాస్ట్' (Blast)…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట (Yadagiri Gutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన…
'నాగబంధం' (Nagabandham) సినిమాలో నటీనటులు చిన్నవాళ్లు. దర్శకుడు కూడా కొత్త. మొన్నటివరకు అంచనాలు కూడా తక్కువే. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో,…