పిల్లలు వద్దు అనుకునే ఒక మధ్యతరగతి యువకుడిగా సుహాస్ నటించాడు ‘జనక అయితే గనక’ అనే చిత్రంలో. వచ్చే నెల 7న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ వచ్చింది.
దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని సందీర్ రెడ్డి బండ్ల డైరెక్ట్ చేశారు. సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా నటించారు.
ట్రైలర్ ని బట్టి చూస్తే ఒక కంపెనీపై హీరో కేసు వెయ్యడం అనే పాయింట్ పై కథ నడుస్తుంది. పెళ్లైనప్పటికీ పిల్లలు వద్దని అనుకునే సుహాస్ కి ఒక రోజు తన భార్య గర్భవతి అని తెలుస్తుంది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆమె నెల తప్పింది. దాంతో, తన భార్య నెల తప్పడానికి కారణం ఐన ఒక కంపెనీపై కేసు వేస్తాడు. ఇది కొత్త పాయింట్.
ట్రైలర్ ఆసక్తిగా ఉంది. కామెడీతో పాటు మెసేజ్ కూడా ఉంది. “OMG” వంటి బాలీవుడ్ సినిమాల తరహాలో విచిత్రమైన కేసు చుట్టూ తిరిగే సినిమా అన్నమాట.
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…