Categories: న్యూస్

ఇంకేం అనుకోలేదు: నాగ చైతన్య

నాగచైతన్య, శోభిత నిశ్చితార్థం పూర్తయింది. ఇక పెళ్లి ఒక్కటే బ్యాలెన్స్. అక్కడే చాలా ఊహాగానాలు, కథనాలు, చర్చలు పుట్టుకొచ్చాయి. చైతూ-శోభిత డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారా? అసలు వాళ్లు ఇండియాలోనే పెళ్లి చేసుకుంటారా.. విదేశాలకు వెళ్తారా..

ఇలా చాలా ప్రశ్నలు, చర్చలు సాగుతున్న వేళ.. తన పెళ్లిపై నాగచైతన్య స్పందించాడు. అసలింతవరకు పెళ్లి గురించి ఏమీ అనుకోలేదని ప్రకటించి షాకిచ్చాడు చైతూ. వీలైనంత త్వరగా వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారనే ఊహాగానాల నేపథ్యంలో, అసలు పెళ్లి వేదికపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చైతూ ప్రకటించడం షాకింగ్.

ఇంతకుముందు సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నాగచైతన్య. ఇద్దరూ గోవాలో పెళ్లి చేసుకున్నారు. సమంతకు, నాగచైతన్యకు ఇద్దరికీ గోవా అంటే ఇష్టం. అందుకే అక్కడ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు.

మరి ఈసారి శోభితకు ఏ ప్లేస్ అంటే ఇష్టమనేది తేలాల్సి ఉంది. గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆమె తనకు రాజస్థాన్ లో పర్యటించడం చాలా ఇష్టమని చెప్పింది. దీంతో చైతూ-శోభిత రాజస్థాన్ లోనే పెళ్లి చేసుకుంటారనే చర్చ సాగుతోంది.

Admin

Recent Posts

Janhvi Kapoor పవర్‌ డ్రెస్సింగ్‌ పై ఒకటే చర్చ!

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…

4 hours ago

విజయ్ కలలాంటి విజయం చూశారు: Anil Ravipudi

హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…

10 hours ago

Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ

ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…

16 hours ago

Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్

టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…

16 hours ago

Pooja Hegde: ఆమెకి కత్తెర వేశాను, దర్శకుడి వ్యాఖ్యలు వైరల్

తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…

16 hours ago

Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం

హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…

2 days ago