Categories: న్యూస్

ఫ్లాపులకు ‘ప్రశంసలు’ ఇచ్చే దర్శకుడు

తమిళంలో కార్తీక్ సుబ్బరాజ్ అనే దర్శకుడు ఉన్నాడు. అతన్ని చాలా గొప్ప దర్శకుడు అని తమిళ ఫిలిం లవర్స్ అంటూ ఉంటారు. మన తెలుగులో మాత్రం అతనికి పెద్దగా క్రేజ్ లేదు… ఇతర తమిళ అగ్ర దర్శకులతో పోల్చితే. ఈ యువ దర్శకుడు ఇటీవల తాను కథ అందించిన తెలుగు చిత్రంతో (గేమ్ చేంజర్), తాను డైరెక్ట్ చేసిన తమిళ చిత్రం (రెట్రో)తో అపజయాలు మూటగట్టుకున్నాడు.

ఐతే, సినిమాలు ఫ్లాప్ ఇచ్చినందుకు కాదు ఫ్లాప్ సినిమాలకు మంచి ‘రివ్యూలు’ ఇస్తూ అడ్డంగా బుక్ అవుతుంటాడు. తమిళంలో పెద్ద దర్శకులు తీసే ఫ్లాప్ సినిమాలకు కార్తీక్ సుబ్బరాజ్ ఆద్భుతంగా తీశారు కంగ్రాట్స్ అంటూ ట్వీట్లు వేస్తూ ఉంటాడు. దాంతో కార్తీక్ సుబ్బరాజు ఇప్పుడు తెగ ట్రోలింగ్ అవుతున్నాడు.

శంకర్ తీసిన “ఇండియన్ 2” ఎంత ఘోర పరాజయం అయిందో మనందరికీ తెలుసు. ఆ సినిమాని ఒక్క క్రిటిక్ కూడా మెచ్చుకోలేదు. ఒక్క ప్రేక్షకుడు కూడా అభినందించలేదు. కమల్ హాసన్ స్వయంగా ఈ రెండో పార్టు కన్నా మూడో పార్టు బాగుంటుంది అని రిలీజ్ కి ముందే ప్రకటించారు. అలాంటి అట్టర్ ఫ్లాప్, బ్యాడ్ మూవీని పొగిడాడు కార్తీక్ సుబ్బరాజు.

“ఇండియన్ 2లో శంకర్ తీసిన కొన్ని సీన్లు అద్భుతం,” అన్నాడు ఈ యువ దర్శకుడు. అలాగే తానే కథ అందించిన “గేమ్ చేంజర్” సినిమాకి కూడా విడుదలైన వెంటనే పొగుడుతూ ట్వీట్లు వేశాడు. హిట్ తీశారు అంటూ కంగ్రాట్స్ కూడా చెప్పాడు శంకర్ కి. మరి రామ్ చరణ్ నటించిన ఈ సినిమా ఎంత నష్టం తెచ్చిందో, ఎంత ఘోరంగా ట్రోలింగ్ ఎదుర్కుందో చెప్పక్కర్లేదు.

ఇక ఇప్పుడు “థగ్ లైఫ్.” మణిరత్నం వైబ్ సినిమాలో కనిపించింది అంటూ పొగిడేస్తూ పోస్ట్ పెట్టాడు. అంతే, జనం అతన్ని ఒక ఆటాడుకుంటున్నారు.

“నీకు హిట్ సినిమా తీసే టాలెంట్ లేదు. ఫ్లాప్ సినిమాని గుర్తించే శక్తి లేదు. ఇండస్ట్రీ పెద్దలను కాకా పట్టేందుకు ఇలాంటి ట్వీట్లు వేస్తూ కాలం గడుపుతున్నావు అంటూ,” తమిళ సోషల్ మీడియా జనం తిట్టి పోస్తున్నారు.

కార్తీక్ సుబ్బరాజు “పిజ్జా” అనే సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అది హిట్. ఆ తర్వాత “జిగర్తాండ” (తెలుగులో “గద్ధలకొండ గణేష్” అనే పేరుతో రీమేక్ అయింది) హిట్. ఈ రెండు సినిమాలు తప్ప మిగతావేవి పెద్దగా ఆడలేదు. రజినీకాంత్ తో “పెట్టా “, లారెన్స్ తో “జిగర్ తండా డబుల్ ఎక్స్”, ధనుష్ తో “జగమే తంత్రం”, సూర్యతో “రెట్రో” తీసిన కార్తీక్ సుబ్బరాజ్ ఇప్పుడు ఇలా ట్రోలింగ్ కి గురవవుతున్నాడు.

Admin

Recent Posts

30 ఏళ్ల తర్వాత కేసు గెలిచిన Sukanya

తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు వంటి సినిమాల్లో నటించిన సుకన్య (Sukanya) ఇప్పుడు వార్తల్లో నిలిచారు. 1990లలో ఆమె పాపులర్…

18 hours ago

Kangana Ranaut: పెద్దిపై ‘క్వీన్’ కామెంట్స్!

'పెద్ది' (Peddi) వివాదాన్ని క్యాష్ చేసుకోవాలని చాలామంది హీరోయిన్లు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. డింపుల్ హయాతీ నుంచి మొదలుపెడితే, నిత్యామీనన్ వరకు…

18 hours ago

దేవిశ్రీ ప్రసాద్ పై Thaman పంచ్!

వృత్తిగతంగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ మధ్య ఉన్న పోటీ గురించి అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం…

19 hours ago

నన్ను పొగడండి ప్లీజ్: Jagapathi Babu

జగపతి బాబు (Jagapathi Babu) హీరోగా ఎంత సక్సెస్ అయ్యారో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా అంతే…

1 day ago

నర్సుల యూనిఫామ్‌లు మార్చాలి: Kangana Ranaut

కంగన రనౌత్ (Kangana Ranaut) మన దేశంలో పనిచేస్తున్న నర్సుల దుస్తులపై విమర్శలు చేసింది. బ్రిటిష్ కాలంలో నర్సులకు ఈ…

1 day ago

Kajal Aggarwal: ‘నాకు సౌత్ సినిమానే గొప్ప’

ఓవైపు జాన్వి కపూర్ ను అసభ్యంగా చూపించారని, సౌత్ సినిమాలో ఇలాంటివి కామన్ అంటూ ట్రోలింగ్ నడుస్తున్న వేళ.. దక్షిణాది…

1 day ago