పవన్ కళ్యాణ్ నటిస్తోన్న మాఫియా చిత్రం …. ఓజి షూటింగ్ చివరి దశకు చేరుకొంది. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయింది. ఈ సినిమాని సెప్టెంబర్ 25, 2025న విడుదల చేస్తామని నిర్మాత దానయ్య అంటున్నారు.
మరోవైపు, బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతోన్న “అఖండ 2” షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ సినిమాని దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల చేస్తామని ఇంతకుముందే ప్రకటించారు. తాజాగా మరోసారి అదే డేట్ అంటూ స్పష్టం చేశారు.
అంటే దసరా బరిలో ఇటు పవన్ కళ్యాణ్, అటు బాలయ్య సినిమాలు ఉంటాయన్నమాట. కానీ ఈ రెండు భారీ చిత్రాలు నిజంగా ఒకటే రోజు విడుదల అవుతాయా? అలా పోటీపడి కలెక్షన్లకు కోత వేసుకుంటాయా? లేదా ఎదో ఒకటి వాయిదా పడుతుందా? వీటికి సమాధానం రావాలంటే ఆగస్టు వరకు వేచి చూడాలి.
“అఖండ 2” డిసెంబర్ కి కానీ, సంక్రాంతికి కానీ వాయిదా పడే అవకాశం ఉందని ఒక టాక్ ఉంది. అలాగే, “ఓజి” చెప్పిన టైంకి వస్తుందా అన్న డౌట్ కూడా ఉంది. “హరి హర వీర మల్లు” ఎన్ని సార్లు పోస్ట్ పోన్ అయిందో చూసాం కదా.
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…