కమల్ హాసన్, రజినీకాంత్ తమ కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో కలిసి నటించారు. ఆ తర్వాత మల్టీ స్టారర్ చెయ్యలేదు. దాదాపు 47 ఏళ్ల తర్వాత చేతులు కలిపారు. ఒకే ఫ్రేములోకి వచ్చారు. కమల్ హాసన్, రజినీకాంత్ హీరోలుగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఒక కొత్త సినిమా తీస్తున్నాడు. దాని ప్రకటన (KH x RK) ఒక వీడియో టీజర్ ద్వారా వచ్చింది.
ఈ టీజర్ లో నెల్సన్ దిలీప్ కుమార్ రజినీకాంత్, కమల్ హాసన్ లకు కాస్ట్యూమ్స్ చెప్పే సీన్ నుంచి వారి ఇంట్రడిక్షన్ మొదలవుతుంది. ఆ తర్వాత ఇద్దరూ నడుచుకుంటూ వచ్చి గ్యారేజ్ లో ఉన్న కారులో కూర్చోవడం, వెనుక సీట్లో నెల్సన్, సంగీత దర్శకుడు అనిరుధ్ కూర్చోవడం, ఆ తర్వాత కమల్ ఇంతకీ హీరో ఎవరు అని అడగడం, దానికి సమాధానం చెప్పు అని రజినీకాంత్ అనడంతో టీజర్ ఎండ్ అవుతుంది.
ఈ సినిమాలో హీరో ఎవరు అనేది ఆ ఇద్దరు హీరోలకు డౌట్ వచ్చింది కానీ ఇద్దరి హీరోల సినిమా అని చెప్పాల్సిన అవసరం లేదు కదా.
ప్రస్తుతం కమల్ హాసన్, రజినీకాంత్ ఇద్దరూ వేర్వేరు సినిమాలతో బిజీగా ఉన్నారు. అవి పూర్తి చేసుకున్న తర్వాత ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారు.
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…