కృతి శెట్టి (Krithi Shetty) సినిమాలు అన్నీ వాయిదాలు పడడమో, ఆగిపోవడమో జరుగుతున్నాయి. వరుసగా మూడు సినిమాలు విడుదల అవుతాయని ఈ అమ్మడు భావించింది. కానీ డిసెంబర్లో ఒకటి విడుదలైంది. ఇప్పుడు ఏప్రిల్ నెలలో మరోటి రానుంది. ఇంకోటి ఎప్పుడు వస్తుందో ఇప్పుడే చెప్పలేం.
ఐతే ఆమె తమిళంలో ఒప్పుకొని గతేడాదే షూటింగ్ లు పూర్తి చేసిన మూడు చిత్రాల్లో రెండో చిత్రం తాజాగా విడుదల డేట్ ని ఫిక్స్ చేసుకొంది.
కృతి శెట్టి మూడేళ్ళ క్రితం “వా వతియార్” (Vaa Vaathiyaar) అనే సినిమాని ఒప్పుకొంది. ఆ సినిమాలో కార్తీ హీరో. అది మూడేళ్లు నిర్మాణంలో ఉండి నాలుగు నెలల క్రితం విడుదలైంది. అలాగే 2024లో ఆమె ఒప్పుకున్న “జీని” (Genie) సినిమా ఇంకా విడుదలకు నోచుకోలేదు. రిలీజ్ చేసే వాళ్ళు లేక ఆగింది.
అలాగే గతేడాదే విడుదల కావాల్సిన “లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ” (L.I.K) అనే చిత్రం మొత్తానికి ఇప్పుడు వెలుగు చూస్తోంది. ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది.
ఆమె మొత్తంగా మూడు తమిళ సినిమాలు ఒప్పుకుంటే ఒకటి చాలా నెలల తరబడి ల్యాబ్ లో మగ్గి విడుదలై ఫ్లాప్ అయింది. ఇప్పుడు రెండో సినిమా వస్తోంది. మరి దీని ఫలితం ఎలా ఉంటుందో? మూడో సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో?
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao) 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం "సింగ్ గీతం"…
పెద్ది సినిమాలో జాన్వి కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని నేరుగా…
హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) మరో డిఫరెంట్ రోల్ లోకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పోలీస్…
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గత కొన్నేళ్లుగా కేరళలో కన్నా హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటున్నాడు. తాను నటించే మలయాళ…
జాన్వీ కపూర్ (Janhvi Kapoor)ని "పెద్ది" సినిమాలో చూపించిన విధానం, ఆమె పాత్ర చిత్రీకరణ విషయంలో రేగిన గోల నేపథ్యంలో…
అందాల నిధి (Nidhhi Agerwal)కి పేరుకు తగ్గట్టుగానే అందాల గని ఉంది. కానీ ఆమెకు ఆవగింజంత అదృష్టం కూడా లేదు.…