రామ్ చరణ్ పెద్ది (Peddi) సినిమా షూటింగ్ లో బిజీగా పాల్గొంటున్నాడు. రెండు పాటలు, కొంత టాకీ పార్ట్ మిగిలి ఉంది. వీటిని స్పీడ్ గా పూర్తి చేసే పనిలో పడ్డాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది.
రామ్ చరణ్ (Ram Charan) హీరోగా దర్శకుడు బుచ్చిబాబు తీస్తున్న “పెద్ది” చిత్రం ఏప్రిల్ 30న విడుదల కావాలి. అంటే అన్ని పనులు ఏప్రిల్ 22లోపు పూర్తి అవ్వాలి. ఆ లోపు మొత్తం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి అవుతుందా అనే డౌట్ అందరిలో ఉంది. కానీ రామ్ చరణ్ మాత్రం తన పుట్టిన రోజు వేడుకలు ముగిసిన వెంటనే షూటింగ్ లో మళ్ళీ పాల్గొనడం మొదలు పెట్టారు. ఇప్పుడు షూటింగ్ పూర్తి అయ్యేంతవరకు రెస్ట్ లేదు అన్నట్లుగా పని చేస్తున్నారు.
ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే క్రికెటర్ గా మొదటి గ్లిమ్ప్స్ లో రామ్ చరణ్ కనిపిస్తే అది బాగా వైరల్ అయింది. తాజాగా కుస్తియోధుడిగా కనిపిస్తే జనం వెర్రెత్తి పోయారు. హనుమంతుడిలా ఉన్నాడు చరణ్ అని అభిమానులు మురిసిపోతున్నారు.
సినిమాపై చాలా పాజిటివ్ ఉంది. ఐతే, రిలీజ్ డేట్ అయోమయమే ఇబ్బంది పెడుతోంది.
పెద్ది చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటించింది. శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…
ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…
చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…
హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని వెల్లడించింది.…
తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…
సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…