నెల రోజులుగా స్తబ్దుగా మారిన రాజ్ తరుణ్ కేసు మళ్లీ వేడెక్కింది. ఎప్పుడైతే లావణ్య మరోసారి పోలీస్ స్టేషన్ కొచ్చి మస్తాన్ సాయిపై ఫిర్యాదు చేసిందో, అప్పట్నుంచి ఈ వ్యవహారం మరిన్ని మలుపులు తీసుకుంటోంది.
మస్తాన్ సాయికి చెందిన హార్డ్ డిస్క్ ను పోలీసులకు అందజేసిన లావణ్య, అక్కడితో ఆగలేదు. ఆ హార్డ్ డిస్క్ లో ఉన్న వీడియోల్ని తను కూడా లీక్ చేయడం మొదలుపెట్టింది. దీంతో కలకలం రేగింది.
మస్తాన్ సాయితో పాటు కొంతమంది యువతీయువకులు డ్రగ్స్ మత్తులో ఊగితూలుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి కొన్ని ఫొటోల్ని కూడా లావణ్య రిలీజ్ చేసింది.
ఒకప్పుడు మస్తాన్ సాయి తనకు మంచి స్నేహితుడు, ఫ్రెండ్ మాత్రమే అని చెప్పుకున్న లావణ్య.. ఇప్పుడు అతడికి వ్యతిరేకంగా మారింది. మస్తాన్ సాయి తన జీవితం నాశనం చేశాడని, లైంగికంగా వేధించాడని, తను మంచిదాన్ని అనడం లేదని, అదే టైమ్ లో ఇతర మహిళలైనా జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో వీడియోలు రిలీజ్ చేస్తున్నట్టు ఆమె వెల్లడించింది.
ఈ మొత్తం వ్యవహారంలో రాజ్ తరుణ్ సైలెంట్ గా ఉన్నాడు. ఇప్పుడీ వివాదం డ్రగ్స్ మలుపు తీసుకోవడంతో, రాజ్ తరుణ్ స్పందించలేదు.
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…