ఈ కాలం పైరసీ కామన్. సినిమా చిన్నదైనా, పెద్దదైనా పైరసీ బారిన పడాల్సిందే. థియేటర్లలోకి వచ్చిన కొన్ని గంటలకే ఆన్ లైన్ లో సినిమా ప్రత్యక్షం కావాల్సిందే. ఎవరికివారు తమకెందుకులే అనే భావనతో ఉండడం వల్ల పైరసీని అరికట్టడం సాధ్యం కావడం లేదు.
ఈ సంగతి పక్కనపెడితే.. విడుదలకు ముందే సినిమా లీక్ అవ్వడమనేది మరింత బాధాకరం. గతంలో పవన్ కల్యాణ్ విషయంలో ఇలానే జరిగింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ విషయంలో సేమ్ సీన్ రిపీట్ అయింది. అయితే ఫలితం మాత్రం రివర్స్ అయింది. అదేంటో చూద్దాం.
గతంలో ‘అత్తారింటికి దారేది’ అనే సినిమా చేశారు పవన్ కల్యాణ్. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ఈ సినిమాను విడుదలకు ముందే కొంతమంది ఈ సినిమాలో కొంత భాగాన్ని ఆన్ లైన్లో లీక్ చేశారు. దీంతో అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. కట్ చేస్తే, లీక్ అయిన మరుసటి రోజు రిలీజైన ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టయింది.
ఇప్పుడు సల్మాన్ విషయంలో కూడా అదే జరిగింది. అతడు నటించిన ‘సికిందర్’ సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు లీక్ అయింది. దీంతో యూనిట్ వెంటనే రంగంలోకి దిగింది. చాలా సైట్స్ ను డౌన్ చేసింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే పవన్ కల్యాణ్ కు జరిగినట్టు, సల్మాన్ కు కూడా భారీ విజయం దక్కుతుందా? రివ్యూస్ అంత ఆశాజనకంగా లేవు. కానీ మరో రెండు, మూడు రోజుల తర్వాత ఫలితం తెలుస్తుంది.
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…