“జాతిరత్నాలు” సినిమాలో ఒక సీన్ ఉంది. జడ్జి పాత్ర పోషించిన బ్రహ్మానందం లాయర్ పాత్ర పోషించిన హీరోయిన్ ని ఉద్దేశించి…లాయర్ అడిగారు కదా ఇచ్చేయండి బెయిల్ అని సెటైర్ వేస్తారు. అన్ని మీరే చేసుకుంటే ఇక మేము ఎందుకు అని ఈసడించుకుంటారు. అలా ఉంది “మా” (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) కమిటీ తీరు.
రెండేళ్ల క్రితం ఎన్నికయిన “మా” కమిటీతో పాటు అధ్యక్షుడి పదవీకాలం ముగింపునకు వచ్చింది. త్వరలో ఎన్నికలు జరగాలి. కానీ ఈ కమిటీ ఈ రోజు సమావేశం అయింది. ఈ కమిటీలోని 26 మంది సభ్యులు హాజరయ్యారు. ‘మా” అధ్యక్షుడు మంచు విష్ణు “పని తీరు”ని మెచ్చుకొని మరోసారి అతన్నే అధ్యక్షుడిగా ఎన్నుకుంటున్నట్లు ఏకగ్రీవ తీర్మానం చేసింది కమిటీ.
ఎన్నికలకు వెళ్లకుండా వాళ్లకు వాళ్ళే సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకొని మంచు విష్ణు ఇంకో రెండేళ్లు అధ్యక్షుడిగా కొనసాగాలని తీర్మానించారు.
గత ఎన్నికల సమయంలో మంచు విష్ణు “మా” కోసం బిల్డింగ్ కట్టిస్తాను అని హామీ ఇచ్చాడు. భూమి కూడా చూసి పెట్టాను అని బిల్డప్ ఇచ్చుకున్నాడు. కానీ ఇంతవరకు దానికి సంబంధించి అతీగతీ లేదు. అయినా ఈ కమిటీ ఆయన పనితీరు బాగుందని, మా బిల్డింగ్ అయ్యేంతవరకు మరో రెండేళ్లు విష్ణు అధ్యక్షుడిగా ఉండాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది.
మరి దీన్ని ఛాలెంజ్ చేస్తూ ఎవరైనా కోర్టుకు వెళ్తారా లేదా అన్నది చూడాలి.
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…