Categories: న్యూస్

పుష్ప 2 టీజర్: రెస్పాన్స్ అదుర్స్

ఊహించనట్లే “పుష్ప 2” సినిమా టీజర్ అదరగొట్టింది. దర్శకుడు సుకుమార్ మరోసారి తన మార్క్ చూపించారు. ఇక అల్లు అర్జున్ ఇప్పటికే మొదటి భాగంలో తన నటనకి జాతీయ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు రెండో భాగంలో కూడా ‘స్టన్నింగ్’ మార్క్ చూపించారు.

ఈ టీజర్లో అల్లు అర్జున్ ‘గంగమ్మ జాతర’లో పాల్గొనేందుకు ఆ దేవతలా వేషం వేసుకొనే వాడిగా కనిపించారు. ఆ ఆడ వేషంలో బాడీ లాంగ్వేజ్, కొంగును దోపుకునే తీరు, కాలును తిప్పే విధానం అదిరిపోయాయి.

సెలెబ్రిటీలు కూడా ఈ టీజర్ అదిరిపోయింది అని మెచ్చుకుంటున్నారు. నాని, అనసూయ వంటి స్టార్స్ ఇప్పటికే తెగ మెచ్చుకున్నారు. అల్లు అర్జున్ కి మరోసారి జాతీయ అవార్డు రావడం ఖాయం అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు.

అల్లు అర్జున్ విశ్వరూపం!

అల్లు అర్జున్ నట విశ్వరూపం ఈ సినిమాలో చూడబోతున్నాం అని మేకర్స్ అంటున్నారు. సాధారణంగా ఒక పెద్ద హీరో ఇలాంటి గెటప్ వేసేందుకు ఒప్పుకోరు. కానీ బన్నీ ఈ సినిమా కోసం ఎలాంటి ఇగోలు పెట్టుకోలేదు. పాత్రకు తగ్గట్లు, దర్శకుడు సుకుమార్ విజన్ కి తగ్గట్లు నటిస్తున్నారు అని అర్థమవుతోంది.

“పుష్ప 2” విడుదలకు ఇంకా నాలుగు నెలల టైం ఉంది. కానీ అప్పుడే టీజర్ వచ్చేసింది. ఈరోజు బన్నీ పుట్టిన రోజు. అందుకే ఈ సినిమాలోని “గంగమ్మ జాతర”కి సంబంధించిన సన్నివేశంలో ఒక చిన్న భాగాన్ని టీజర్ గా మలిచి విడుదల చేశారు.

చిత్తూరు, తిరుపతి పరిసరాల్లో గంగమ్మ జాతర చాలా పాపులర్. ఈ జాతరలో భక్తులు ఇలా గంగమ్మలా వేషం కడుతారు. అల్లు అర్జున్ ఇలా వేషం కట్టి ఈ జాతరలో తన ప్రత్యర్థుల ఆటలు కట్టించే సీన్ ఇది.

టీజర్ తో అంచనాలు ఈ రెండో భాగంపై మరింత పెరిగాయి.

Admin

Recent Posts

Sonakshi Sinha: అవకాశాలు తగ్గినా పర్లేదు!

సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…

2 hours ago

Varanasi: ఓవర్సీస్ రేట్లు మరీ ఓవర్ గా ఉన్నాయట

రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…

3 hours ago

Peddi: మిగతా అన్ని భాషల్లోనూ అట్టర్ ఫ్లాప్

రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…

3 hours ago

Ram Pothineni: ఈ రోజు నుంచి మొదలుపెట్టాడు

రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…

4 hours ago

Sithara: జులై నుంచి అక్టోబర్, వరుసగా నాలుగు చిత్రాలు

వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…

19 hours ago

Bloody Romeo: నాని సినిమా ఆగలేదు, మొదలు ఎప్పుడంటే

ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…

22 hours ago