సూపర్ స్టార్ మహేష్ బాబు టైం దొరికితే చాలు విదేశాలకు వెకేషన్ వెళ్తారు. ఆయన ఈ ఏడాది ఇప్పటికే ఒకసారి యూరోప్, రెండు సార్లు దుబాయ్, ఒకసారి ఆస్ట్రియా వెళ్లి వచ్చారు. మరి ఇంత ఎండాకాలంలో ఎలాంటి షూటింగ్ లు లేని ఈ టైంలో హైదరాబాద్ లో ఎందుకు ఉంటున్నారు? వెకేషన్ కి ఇంకా ఎందుకు వెళ్ళలేదు? దానికి కారణం రాజమౌళి అని చెప్పాలి.
రాజమౌళి – మహేష్ బాబు సినిమా షూటింగ్ జూన్ లో కానీ జులైలో కానీ మొదలవుతుంది. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలను చర్చించేందుకు ఇటీవల మహేష్ బాబు, రాజమౌళి, నిర్మాత కె. ఎల్. నారాయణ దుబాయ్ వెళ్లారు. కానీ, వీరు వెళ్లిన రెండు రోజులకే అక్కడ వరదలు వచ్చాయి. దాంతో, వెంటనే హైదరాబాద్ రావాల్సి వచ్చింది.
ప్రస్తుతం మహేష్ బాబు ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సీన్లు ప్రాక్టీస్ చేస్తున్నారట. రాజమౌళి చెప్పినవి చేసేందుకు ఇక్కడే ఉండి ఇంట్లోనే ప్రిపేర్ అవుతున్నారు.
షూటింగ్ కి పక్కాగా ముహూర్తం ఫిక్స్ అయ్యాక, ఆ డేట్ ఎప్పుడో తెలిసిన తర్వాత, ఆ ముహూర్తానికి కొద్ది రోజుల ముందు వెకేషన్ కి వెళ్లాలని మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నారట. అది ఈ నెలలోనే ఉండొచ్చు.
ALSO READ: మహేష్ జుట్టు… ఇంకా ప్రూఫ్ అక్కర్లేదు!
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…