చాలా ఏళ్ళు మహేష్ బాబు ఒకే తీరు స్టయిల్ మైంటైన్ చేశారు. జుట్టు ట్రిమ్ గా, గడ్డం, మీసం కూడా ఉండీలేనట్లుగా ఉంచుకునేవారు. దాంతో మహేష్ బాబు లుక్స్ గురించి ఆ మధ్య చాలా కామెంట్స్ వినిపించాయి. దాంతో “సర్కారు వారి పాట” నుంచి తన స్టయిల్ ని ఆయన మార్చేశారు.
“సర్కారు వారి పాట” “గుంటూరు కారం” సినిమాల్లో పొడువాటి హెయిర్ స్టయిల్ లో కనిపించారు. “గుంటూరు కారం” కోసం గడ్డం కూడా కొంచెం థిక్ గా పెంచుకున్నారు.
మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ, ఆయన సోదరుడు రమేష్ బాబుకి ఒక వయసుకి వచ్చాక జుట్టు బాగా ఊడిపోయింది. మహేష్ బాబుకి కూడా హెయిర్ సమస్య వచ్చింది అని ఆ ఆమధ్య పుకార్లు చెలరేగాయి. “సర్కారు వారి పాట” సినిమాలో మహేష్ బాబు హెయిర్ ఎక్సటెన్షన్స్ పెట్టుకున్నారు అని కొందరు, విగ్ అని మరికొందరు ప్రచారం చేశారు.
ఇంకొందరు ఆయన హెయిర్ వీవింగ్ చేయించుకున్నారేమో అని సందేహం వ్యక్తం చేశారు. కానీ ఇటీవల మహేష్ బాబు ఎక్కువగా కెమెరా కంటికి తరచుగా చిక్కుతున్నారు. నాలుగు, ఐదు నెలలుగా ఆయన షూటింగ్ ల్లో పాల్గొనడం లేదు కానీ బయట మాత్రం కనపడుతున్నారు. 4 నాలుగు నెలల క్రితం ఆయన జుట్టు పొడువుకి, ఇప్పటి లెంగ్త్ కి చాలా తేడా కనిపిస్తోంది.
జుట్టు నిజం!
అంటే మహేష్ బాబు ది నిజమైన జుట్టు అని అర్థమవుతోంది. సహజంగా ఎలా పెరుగుతుందో అలా ఉంది మరి. సో, ఇక మహేష్ బాబు జుట్టు గురించి ఇక రూమర్లకు పూర్తిగా తెరపడిపోవాల్సిందే. ఇంతకన్నా ప్రూఫులు ఏమవసరం?
ఇలా పొడుగ్గా జుట్టు పెంచుకుంటున్నది రాజమౌళి తీసే కొత్త చిత్రం కోసమే. మహేష్ బాబు – రాజమౌళి చిత్రం (#SSMB29) జూన్ లో మొదలు కానుంది. మహేష్ బాబు రాజమౌళి కోరిక మేరకు జుట్టు పెంచుతున్నారు.
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…