రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతోన్న మొదటి చిత్రం… వారణాసి (Varanasi). ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో జరుగుతోంది. తాజాగా ఈ సెట్ నుంచి ఒక యాక్షన్ సీన్ కి సంబంధించిన క్లిప్ లీక్ అయింది.
సుడులు తిరుగుతున్న గంగా నదిలో తెప్పలు, పడవల్లో వెళ్తున్న జనం, వాటి మధ్యలో మహేష్ బాబు ఉన్న ఒక సీన్ ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది.
వారణాసి సినిమా సెట్ నుంచి ఇప్పటికే చాలా లీకులు వచ్చాయి. తాజాగా ఇప్పుడు కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ కు సంబంధించిన సన్నివేశం ఇలా బయటికి వచ్చింది.
ఐతే రాజమౌళి సినిమాలకు ఈ లీకులు పెద్దగా ప్రభావం చూపవు. ఆయన సినిమాల్లో గ్రాఫిక్స్ తోడై, కీరవాణి సంగీతం కలిసిన తర్వాత కలిసే మేజిక్ వేరు. సాధారణంగా చూసే సెట్ సీన్లతో పెద్దగా మజా ఉండదు. అందుకే, రాజమౌళి ఈ లీకుల విషయంలో ఇబ్బంది పడడం లేదు.
రాజమౌళి ఈ సినిమాతో గ్లోబల్ మార్కెట్ కొల్లగొట్టాలని ప్లాన్ వేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 6న “వారణాసి” సినిమా విడుదల అవుతుంది. షూటింగ్ దశలోనే విదేశీ జర్నలిస్టులకు ఇంటర్వ్యూలు ఇచ్చేసి ఇప్పటికే హాలీవుడ్ లో ప్రమోషన్ షురూ చేశారు.
మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా నటిస్తోంది. మాధవన్, పృథ్వీరాజ్ సుకుమారన్ , ప్రకాష్ రాజ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…