రామ్ పోతినేని (Ram Pothineni)కొత్త సినిమా ఇంకా ప్రకటించలేదు. గతేడాది ఎన్నో ఆశలు పెట్టుకొని నటించిన “ఆంధ్ర కింగ్ తాలూకా” బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దాంతో, కొత్త సినిమాలపై ఆలోచనలో పడి మొత్తానికి ఒక సినిమా ఒప్పుకున్నాడు.
కొత్త దర్శకుడు తీసే ఈ సినిమా ఈ నెలాఖరులో కానీ వచ్చే నెలలో కానీ ముహూర్తం జరుపుకోనుంది. రామ్ సోదరుడే ఈ సినిమాని నిర్మిస్తాడట. లోకి విగ్నేష్ (Logi Vignesh) అనే కొత్త దర్శకుడు చెప్పిన కథని రామ్ ఇప్పటికే ఓకె చేశాడు. ఆ సినిమానే సెట్స్ పైకి వెళ్తుంది.
ఈ సినిమా మీద నమ్మకంతో తన సోదరుడు కృష్ణ పోతినేనికి నిర్మాణం అప్పచెప్పాడు.
రామ్ పోతినేని ఇప్పుడు కొత్త సినిమాలపై చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. “ఇస్మార్ట్ శంకర్” తర్వాత సరైన బ్లాక్ బస్టర్ లేదు. రొమాంటిక్ చిత్రాల నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు యాక్షన్ సినిమాలు ఎక్కువగా చేస్తున్నాడు. ఈ కొత్త సినిమాలో న్యూ ఏజ్ నేరేషన్ ఉంటుందట.
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…
మలయాళ చిత్రసీమలో రిస్కీ స్టంట్స్ చేసే హీరోగా పేరు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). తన సినిమాల్లో డూప్…
మైఖేల్ జాక్సన్ (Michael Jackson) గురించి తెలియని వారు ఉండరు. ఈ తరం వారికి కూడా ఆయన పేరు, ఆయన…
సమంత పరీక్షలో 100 మార్కులతో పాస్ అయింది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత వెండితెరపైకి వచ్చిన సమంతకి తెలుగు జనం "మా…
ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). 'బ్లాస్ట్' (Blast) సక్సెస్ తర్వాత ఈమె…