ఫీచర్లు

Multi-heroines: కలిసి నటిస్తున్న భామలు

పూజ హెగ్డే (Pooja Hegde), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ఇద్దరూ పెద్ద హీరోయిన్లే. అయినా కలిసి ఒక సినిమాలో నటించారు. ఒక హీరోకి ఇద్దరు భామలుగా కనిపిస్తున్నారు. ఇక రష్మిక మందాన (Rashmika Mandanna, కృతి సనన్ (Kriti Sanon) ఇంకా పెద్ద హీరోయిన్లు. ఇద్దరికీ సోలోగా చాలా క్రేజు ఉంది. అయినా ఇద్దరూ కలిసి ఒక హీరో సరసన స్క్రీన్ పంచుకున్నారు.

పెద్ద హీరోయిన్లే కాదు చిన్న హీరోయిన్లు, మిడ్ రేంజ్ హీరోయిన్లు కూడా ఒక హీరోతో కలిసి స్క్రీన్ పంచుకుంటున్నారు. సంయుక్త, నభా నటేష్ ఒక సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఆ సినిమా… స్వయంభు. వచ్చే నెల విడుదల కానుంది ఈ సినిమా. అలాగే నాగబంధం అనే మరో సినిమాలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇది కూడా ఈ వేసవిలోనే రానుంది.

రాకా (raakaa)

అల్లు అర్జున్ హీరోగా అట్లీ తీస్తున్న “రాకా”లో ఏకంగా నలుగురు హీరోయిన్లు స్క్రీన్ పంచుకోనున్నారు. మెయిన్ హీరోయిన్ గా దీపికా పదుకోన్ నటిస్తుండగా, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందాన వంటి పెద్ద హీరోయిన్లు కూడా కనిపించనున్నారు.

టాక్సిక్ (Toxic)

యష్ హీరోగా రూపొందుతోన్న భారీ చిత్రం టాక్సిక్ లో ఏకంగా ఐదుగురు హీరోయిన్లు ఉన్నారు. నయనతార, కియారా అద్వానీ వంటి పెద్ద హీరోయిన్లతో పాటు తార సుతారియా, హ్యూమా కురేశి వంటి చిన్న హీరోయిన్లు కూడా నటిస్తున్నారు.

కాక్ టైల్ 2 (Cocktail 2)

కాక్ టైల్ 2 అనే హిందీ సినిమాలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు. రష్మిక మందాన, కృతి సనన్ జంటగా నటించారు. వీళ్ళు ఇద్దరూ లెస్బియన్స్ గా కనిపిస్తారనే ఒక పుకారు కూడా నడుస్తోంది. అంటే హీరోతోనే కాదు ఇద్దరి హీరోయిన్ల మధ్య కూడా కెమిస్ట్రీ చూస్తాం.

హై జవానీ తో ఇష్క్ హోనా హై (Hai Jawani Toh Ishq Hona Hai)

ఈ సినిమాలో హీరోగా వరుణ్ ధావన్ నటించాడు. వచ్చే నెల ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో పూజ హెగ్డే, మృణాల్ ఠాకూర్ ఇద్దరూ అతనికి లవర్స్ గా కనిపిస్తారు ఇద్దరు పాపులర్ హీరోయిన్లు ఒక మిడ్ రేంజ్ హీరో సరసన స్క్రీన్ పంచుకోవడం విశేషమే.

స్వయంభు (Swayambhu)
ఇక తెలుగు చిత్రం స్వయంభులో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తుండగా సంయుక్త మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో మరో భామగా నభా నటేష్ నటిస్తోంది.

TeluguCinema

Recent Posts

Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!

తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…

2 hours ago

Ram Gopal Varma: నాగ్ మీద ఒట్టు అఖిల్ బెస్ట్

రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…

1 day ago

Prithviraj Sukumaran: హీరో కాలులో 3 స్క్రూలు!

మలయాళ చిత్రసీమలో రిస్కీ స్టంట్స్ చేసే హీరోగా పేరు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). తన సినిమాల్లో డూప్…

1 day ago

Michael: బిలియన్ డాలర్ల క్లబ్బులో… కొత్త రికార్డు ఖాతాలో

మైఖేల్ జాక్సన్ (Michael Jackson) గురించి తెలియని వారు ఉండరు. ఈ తరం వారికి కూడా ఆయన పేరు, ఆయన…

2 days ago

Kiran Abbavaram: ఇక ‘చెన్నై లవ్ స్టోరీ’తో పరీక్ష స్టార్ట్

సమంత పరీక్షలో 100 మార్కులతో పాస్ అయింది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత వెండితెరపైకి వచ్చిన సమంతకి తెలుగు జనం "మా…

2 days ago

Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి

ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). 'బ్లాస్ట్' (Blast) సక్సెస్ తర్వాత ఈమె…

2 days ago