రామ్ చరణ్ (Ram Charan) హీరోగా “పెద్ది” అనే సినిమా రూపొందుతోంది. అది ఇంకా విడుదల కాలేదు. మరో రెండు నెలల్లో థియేటర్లలోకి వస్తుంది. “పెద్ది” తర్వాత రామ్ చరణ్ దర్శకుడు సుకుమార్ తీసే సినిమా చేస్తాడు. అది ఇప్పటికే ఫిక్స్ అయింది. త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది. ఇక మరో సినిమాని కూడా రామ్ చరణ్ రెడీ చేస్తున్నట్లు టాక్.
బాలీవుడ్ అగ్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) తన నిర్మాణ సంస్థలో తెలుగు హీరోలతో సినిమాలు తీయాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో ఇప్పటికే చర్చలు జరిపారు. అందులో భాగంగా రామ్ చరణ్ తో ఒక సినిమా లాక్ చేసినట్లు టాక్.
అడవి నేపథ్యంగా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా కథని భన్సాలీ రైటర్లు ఇప్పటికే రెడీ చేశారట. ఈ కథ మొదటి ఐడియా “బాహుబలి” రచయిత విజయేంద్రప్రసాద్ నుంచి వచ్చిందట. దాన్ని భన్సాలీ టీం బాగా డెవలప్ చేసి రామ్ చరణ్ కి వినిపించిందట. చరణ్ దాదాపుగా ఒప్పుకున్నట్లే. ఐతే, ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఇప్పుడే చెప్పలేం.
రామ్ చరణ్ ఇకపై సినిమాల విషయంలో స్పీడ్ పెంచాలని భావిస్తున్నారు. బహుశా సుకుమార్ సినిమా మొదలైన కొన్ని నెలల తర్వాత మొదలుపెడుతారేమో.
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…
మలయాళ చిత్రసీమలో రిస్కీ స్టంట్స్ చేసే హీరోగా పేరు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). తన సినిమాల్లో డూప్…
మైఖేల్ జాక్సన్ (Michael Jackson) గురించి తెలియని వారు ఉండరు. ఈ తరం వారికి కూడా ఆయన పేరు, ఆయన…
సమంత పరీక్షలో 100 మార్కులతో పాస్ అయింది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత వెండితెరపైకి వచ్చిన సమంతకి తెలుగు జనం "మా…