నటి మలైకా అరోరా (Malaika Arora) మరోసారి వార్తల్లో నిలిచింది. టీవీ నటుడు సొరబ్ బేడీ (Sorab Bedi) ఒక పార్టీలో ఆమెతో డ్యాన్స్ చేస్తూ కనిపించిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో ఇద్దరూ మ్యూజిక్‌కు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ, ఒకరిపైఒకరు పడిపోతూ, సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా గడిపిన దృశ్యాలు కనిపించాయి.
ఈ వీడియో వైరల్ కావడంతో, మలైకా అరోరా, సోరబ్ బేడీ మధ్య డేటింగ్ జరుగుతోందనే ప్రచారం సోషల్ మీడియాలో మొదలైంది.
అయితే తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సోరబ్ బేడీ ఈ డేటింగ్ రూమర్లను పూర్తిగా తోసిపుచ్చాడు.
“ఆమె నా స్నేహితుల స్నేహితురాలు. ఆ పరిచయంతోనే మలైకా అరోరాతో నాకు స్నేహం ఏర్పడింది. అంతకుమించి మా ఇద్దరి మధ్య ఏమి లేదు,” అని సోరబ్ బేడీ స్పష్టం చేశాడు.
మలైకా అరోరాకు డేటింగ్ రూమర్లు కొత్తేమీ కాదు. ఆమె గతంలో నటుడు Arjun Kapoorతో చాలా సంవత్సరాల పాటు ప్రేమ బంధం కొనసాగించింది. ఆమె భర్త Arbaaz Khanతో వివాహ బంధంలోనే ఉన్నప్పుడే అర్జున్ తో డేటింగ్ చేశారు. అనంతరం ఆమె భర్త నుంచి విడాకులు తీసుకున్నారు.
మలైకా అరోరాకు 20 ఏళ్లకు పైగా వయస్సున్న ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయినప్పటికీ, 52 ఏళ్ల వయస్సులోనూ ఆమె గురించి కొత్త కొత్త డేటింగ్ వార్తలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి.
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…
రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) రిలీజ్…
పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…