‘భైరవం’ సినిమాపై బాయ్ కాట్ ట్రెండ్ నడిచిన సంగతి తెలిసిందే. అప్పుడెప్పుడో నాలుగేళ్ల కిందట విజయ్ కనకమేడల, చిరు-చరణ్ పై పెట్టిన అభ్యంతరక పోస్టుపై మెగా ఫ్యాన్స్ భగ్గుమన్నారు. అతడు తీసిన భైరవం సినిమాను ‘బాయ్ కాట్’ చేస్తామంటూ ప్రకటించారు.
ఆ పోస్టుకు తనకు సంబంధం లేదని, అయినప్పటికీ అందరికీ సారీ అంటూ స్టేట్ మెంట్ రిలీజ్ చేశాడు విజయ్ కనకమేడల. అయినప్పటికీ మెగా ఫ్యాన్స్ కొందరు చల్లారలేదు. దీంతో మంచు మనోజ్ స్వయంగా రంగంలోకి దిగాడు.
‘భైరవం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడిన మనోజ్, విజయ్ తరఫున, టీమ్ తరఫున తను క్షమాపణలు చెప్పాడు. 9 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకులముందుకొస్తున్నానని, దయచేసి అంతా సహకరించాలని విజ్ఞప్తి చేశాడు.
మెగా హీరోలంటే విజయ్ కు చాలా ఇష్టమని, అతడి వాట్సాప్ డీపీలో కూడా పవన్ కల్యాణ్ తో దిగిన ఫొటో ఉంటుందని గతంలో ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు మనోజ్. అలాంటి వ్యక్తిని ఒంటరిని చేసి టార్గెట్ చేయడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది ‘భైరవం’.
ప్రభాస్ (Prabhas) ఒకేసారి రెండు, మూడు చిత్రాలను సెట్స్ పై ఉంచుతాడు. 'బాహుబలి 2' విడుదల తర్వాత ఇలా చేస్తూ…
నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తన పారితోషికాన్ని తగ్గించాలన్న నిర్మాతల మాటకి నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే…
బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన హీరోయిన్లలో తాప్సీ, తమన్నా కన్పిస్తారు.. తెలుగు సినిమాల ద్వారానే…
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…