నాగచైతన్య రెండో పెళ్లికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే శోభితతో నిశ్చితార్థం పూర్తిచేసిన ఈ హీరో, ఆమెను తన అర్థాంగిని చేసుకోబోతున్నాడు. దీనికి సంబంధించి గోధుమ రాయి (పసుపు దంచే) కార్యక్రమం ఈరోజు (October 21) శోభిత ఇంట్లో జరిగింది. అంటే పెళ్లి పనులు మొదలైనట్టే.
పెళ్లి పనులు మొదలుపెట్టినప్పటికీ పెళ్లి తేదీని మాత్రం ఇంకా నాగచైతన్య బయటపెట్టలేదు. అటు నాగచైతన్య, ఇటు శోభితలో ఎవ్వరూ పెళ్లి తేదీని ఇంకా వెల్లడించలేదు.
తాజా సమాచారం ప్రకారం.. నాగచైతన్య-శోభిత డిసెంబర్ మొదటి వారంలో (December 4 and 5) పెళ్లి చేసుకోబోతున్నారు. త్వరలోనే టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు చాలామంది పెళ్లి శుభలేఖలు అందుకోబోతున్నారు.
ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న నాగచైతన్య-శోభిత్.. ఆ రోజు దిగిన ఫొటోల్ని షేర్ చేశారు. ఆ తర్వాత మళ్లీ ఆమెతో కనిపించలేదు చైతూ. ఎట్టకేలకు రీసెంట్ గా శోభిత-చైతూ కలిసి దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అలా ఫొటో వైరల్ అయిన కొన్ని రోజులకే శోభిత ఇంట పెళ్లి పనులు మొదలయ్యాయి. త్వరలోనే నాగచైతన్య, శోభిత తమ పెళ్లి వివరాల్ని వెల్లడించబోతున్నారు.
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…