కొందరికి కొన్ని సినిమాలు అలా కనెక్ట్ అయిపోతాయి. దీనికి హీరోలు కూడా అతీతం కాదు. అలా హీరో నానికి అలా ఓ సినిమా తెగ నచ్చేసింది. అదే ‘సత్యం సుందరం’. కార్తి, అరవింద్ స్వామి హీరోలుగా నటించిన ఈ సినిమా నానికి ఎంతలా నచ్చిందంటే, ఈ పదేళ్లలో తనకు నచ్చిన ఒకే ఒక్క సినిమా అదేనంటూ కితాబిచ్చాడు.
ఈ పదేళ్లలో హీరోగా ఎన్నో సినిమాలు చేశాడు నాని. నిర్మాతగా ‘కోర్ట్’ లాంటి సినిమాలు కూడా తెరకెక్కించాడు. అయినప్పటికీ వాటన్నింటినీ మించి ‘సత్యం సుందరం’ సినిమాను తన ఫేవరెట్ మూవీగా చెప్పుకొచ్చాడు.
హీరో, విలన్, ఫైట్స్, ఐటెంసాంగ్స్ లాంటివి పెట్టుకోకుండా, సున్నితమైన ఎమోషన్ తో, బలమైన సన్నివేశాలు ఆ సినిమాలో ఉన్నాయంటున్నాడు నాని. అలాంటి సినిమాను ఈ పదేళ్లలో తను ఎక్కడా చూడలేదంటున్నాడు.
ప్రస్తుతం ఈ హీరో మాస్ బాట పట్టిన సంగతి తెలిసిందే. ‘హిట్-3’ తర్వాత ‘ప్యారడైజ్’ అనే సినిమా చేస్తున్నాడు.
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…