నటి నిహారిక కొణిదెల (Niharika Konidela) యాక్టింగ్ వదిలేసింది. నిర్మాతగా మారి విజయం సాధించింది. మొదట ఆమె వెబ్ సిరీస్ లు, వెబ్ కంటెంట్ నిర్మించింది. ఆ తర్వాత సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. తాజాగా “రాకాస” (Rakasa) అనే సినిమాని నిర్మించింది. ఏప్రిల్ 3న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉంది.
తన నిర్మాణ శైలి, తన కథలు ఎంచుకునే విధానం గురించి మాట్లాడింది. తనకు నచ్చిందే చేస్తాను కానీ ఇతరుల మాటలు, కామెంట్స్ పట్టించుకోను అని పేర్కొంది.
“కమిటీ కుర్రాళ్ళు నిర్మిస్తున్నప్పుడు అంతమంది కొత్తవాళ్లతో సినిమా అవసరమా అన్నారు. ఇప్పుడు ఈ గ్రాఫిక్స్ అవీ అవసరమా అని రాకాస గురించి కామెంట్స్ చేస్తున్నారు. అవన్నీ పట్టించుకోను. కథ నచ్చితే, దానికి తగ్గట్లుగానే సినిమా నిర్మిస్తాను. నాకు నచ్చిందే చేస్తాను. ఇతరుల కామెంట్స్ ని సీరియస్ గా తీసుకోను,” అని పేర్కొంది.
నిహారిక కొణిదెల తాజాగా తన సోదరుడు వరుణ్ తేజ్ హీరోగా మరో సినిమా ప్రకటించింది. ఆమె తన బ్యానర్ పై తీసే సినిమాలపై పక్కా ప్లానింగ్ తో ఉంది.
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…