హీరోయిన్ జాన్వీ కపూర్ నాని సరసన నటించనుంది అని ఇటీవల బాగా ప్రచారం జరిగింది. నాని కొత్త సినిమాలో ఆమె హీరోయిన్ గా కన్ఫర్మ్ అయిపోయినట్లుగా మీడియాలో న్యూస్ శిఖర్ చేసింది. అంతే కాదు, ఈ సినిమాకోసం ఆమె ఏకంగా ఆరు కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేసింది అని వార్తలు వచ్చాయి.
ఇదే విషయాన్ని హీరో నానిని అడిగితే జాన్వీ కపూర్ తన సరసన నటించనుంది అన్న విషయం తనకు తెలియదు అంటున్నాడు.
‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల – నాని కాంబినేషన్ లో రెండో చిత్రం ఇటీవల ఘనంగా ప్రారంభం అయింది. ఐతే ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఒక పెద్ద స్టార్ ని తీసుకుంటే పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ వస్తుంది అని నిర్మాతల ఆలోచన. దానికి తగ్గట్లే జాన్వీ కపూర్ ని తీసుకుందామని అనుకున్నారట.
“బహుశా ఆమె పేరు వారి దర్శకుడు, నిర్మాతల మాటల్లో వచ్చి ఉంటుంది. నాకు తెలిసినంతవరకు ఆమెని కలిసి కథ చెప్పి ఉండరు. సో, ఆమె ఈ సినిమాలో నటిస్తోంది అన్న మాట నిజం కాదు. ఇప్పటివరకు ఐతే ఏ హీరోయిన్ ని తీసుకోలేదు,” అని నాని క్లారిటీ ఇచ్చాడు.
మరోవైపు జాన్వీ కపూర్ నటించిన మొదటి తెలుగు చిత్రం “దేవర” సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఆమె రెండో చిత్రం రామ్ సరసన. రామ్ చరణ్ మూవీ షూటింగ్ ఈ ఏడాది చివరలో మొదలు అవుతుంది. మరి జాన్వీ నాని సినిమాలో నటిస్తుందా లేదా అన్నది చూడాలి.
ఒకే సినిమాతో హీరోకి, హీరోయిన్ కి విషమ పరీక్ష ఎదురుకావడం అరుదు. "లెనిన్" (Lenin) సినిమా విషయంలో అదే జరుగుతోంది.…
ఒకప్పుడు తన స్పెషల్ సాంగ్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్‌లతో కుర్రకారును ఉర్రూతలూగించిన ముమైత్ ఖాన్ (Mumait Khan), ఒకప్పుడు తన జీవితంలోని…
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao) 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం "సింగ్ గీతం"…
పెద్ది సినిమాలో జాన్వి కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని నేరుగా…
హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) మరో డిఫరెంట్ రోల్ లోకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పోలీస్…
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గత కొన్నేళ్లుగా కేరళలో కన్నా హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటున్నాడు. తాను నటించే మలయాళ…