ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) విడుదలైన నాలుగు రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి చెందిన నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ (Pawan Kalyan Creative Works) ఒక ప్రకటన చేసింది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు వెంటనే ఏ సినిమా చేయబోవడం లేదంట.
“ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమాలు ఒప్పుకోలేదు. ఏ సినిమాని స్టార్ట్ చెయ్యడం లేదు. ఓజి 2 గురించి కూడా పవన్ కళ్యాణ్ మాత్రమే చెప్తారు. పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకు సంబంధించి ఎలాంటి ఊహాగానాలకు తావు లేదు,” అని ప్రకటన సారాంశం.
ఉస్తాద్ భగత్ సింగ్ సరైన ఓపెనింగ్స్ కూడా పొందకపోవడం, బాక్సాఫీస్ పరంగా బాగా నిరాశపర్చడంతో పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి, ఇంతకుముందు ప్రకటించిన సురేందర్ రెడ్డి (Surender Reddy) చిత్రం అవుతుంది? అది ఇప్పట్లో స్టార్ట్ అవుతుందా? ఈ ప్రశ్నలకు ప్రస్తుతానికి సమాధానం లేదు.
దర్శకుడు సురేందర్ రెడ్డి, రచయిత వక్కంతం వంశీ ఇటీవలే పవన్ కళ్యాణ్ ని కలిశారు. సినిమాని అధికారికంగా ప్రకటించారు. నిజానికి ఉగాది సందర్భంగా సినిమా మొదలవుతుంది అని తెలిపారు. కానీ ఇప్పుడు ఏకంగా సినిమాని తాత్కాలికంగా నిలిపివేశారు.
ఇప్పుడు కాకపోయినా కొన్ని నెలల తర్వాత అయినా అది మొదలవుతుందా అనేది చూడాలి.
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…
రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) రిలీజ్…
పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…