ప్రస్తుతం టాలీవుడ్ లో పర్సంటేజీ (Percentage) లొల్లి నడుస్తోంది. సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమాన్యాలు తమకు రెంట్ సిస్టమ్ వద్దని, పర్సంటేజీ కావాలని అడుగుతున్నారు. దీనికి యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులు అభ్యంతరం చెబుతున్నారు.
సరిగ్గా ‘పెద్ది’ లాంటి పెద్ద సినిమా విడుదల టైమ్ లో సింగిల్ స్క్రీన్ థియేటర్ లీజుదారులు బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారంటూ చాలా పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చారు నిర్మాత రవిశంకర్. దీనిపై ఎగ్జిబిటర్లు స్పందించారు. ‘పెద్ది’ లాంటి పెద్ద సినిమా పర్సంటేజీలో విడుదలైతే ఎంత తేడా వస్తుందో చెబుతున్నారు.
‘పెద్ది’ లాంటి సినిమాలు మొదటి వారం రోజులు హౌజ్ ఫుల్స్ నడుస్తాయి కాబట్టి, దాన్ని పర్సంటేజీలో విడుదల చేస్తే.. రెంట్ సిస్టమ్, పర్సంటేజీ సిస్టమ్ మధ్య తేడా కేవలం 7-8 కోట్ల రూపాయలు మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. ఆ మాత్రం తేడాకే నిర్మాతలు ‘పెద్ది’ని బూచిగా చూపిస్తున్నారని విమర్శిస్తున్నారు.
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ట్రయిలర్ ను 18న ముంబయిలో రిలీజ్ చేస్తున్నారు. ఆ తర్వాత భోపాల్ లో ఐటెంసాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. విజయనగరంలో కూడా ఈవెంట్ ప్లాన్ చేశారు.
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…