సినీనటుడు మోహన్ బాబు ఫామ్ హౌజ్ కు వచ్చి హెచ్చరించిన వ్యక్తుల్ని పోలీసులు గంటల వ్యవథిలో పట్టుకున్నారు. వీళ్లను మైలార్ దేవ్ పల్లిలోని దుర్గానగర్ కు చెందిన యువకులుగా గుర్తించారు. వీళ్లంతా నిన్న రాత్రి కారులో మోహన్ బాబు ఫామ్ హౌజ్ కు వచ్చి బెదిరించారు.
ఇన్నోవా కారులో వచ్చిన ఈ వ్యక్తులు, నేరుగా మోహన్ బాబు ఫామ్ హౌజ్ గుమ్మం వద్దకు వెళ్లి బెదిరింపులకు పాల్పడినట్టు వాచ్ మెన్ తెలిపాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేరు. విషయం తెలుసుకున్న మోహన్ బాబు వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా కారును గుర్తించారు. ఆ సమాచారం ఆధారంగా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. వీళ్లంతట వీరే వార్నింగ్ ఇచ్చారా లేక వేరే వ్యక్తులు ఎవరైనా వీళ్ల చేత బెదిరింపులకు పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh) తెగ హడావిడి చేస్తోంది. సినిమాకి ఎంత ప్రచారం చెయ్యాలన్నా చేస్తాను అన్నట్లు "నాగబంధం"…
ఈ దసరా పండక్కి (Dasara 2026) రెండు పెద్ద సినిమాలు పోటీ పడేలా ఉన్నాయి. ఒక పెద్ద సినిమాకి అధికారికంగా…
మాళవిక మోహనన్ అంటేనే గ్లామర్ షో అని చెప్పాలి. ఆమె అందాల ఆరబోతలో అస్సలు సిగ్గుపడదు. ఇక ఇప్పుడు మాల్దీవుల్లో…
ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan) ... తెలుగులో ఆమె మొదటి సినిమా 'కన్నప్ప'. అలాగే ఆమె నటించిన 'బ్లాస్ట్' (Blast)…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట (Yadagiri Gutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన…
'నాగబంధం' (Nagabandham) సినిమాలో నటీనటులు చిన్నవాళ్లు. దర్శకుడు కూడా కొత్త. మొన్నటివరకు అంచనాలు కూడా తక్కువే. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో,…